బంపర్ ఆఫర్ కొట్టేసిన ఎన్టీఆర్ బయోపిక్!

 

నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న చిత్రం తన తండ్రి అయిన నందమూరి తారక రామారావు గారి జీవితకథ. అదే ఎన్టీఆర్ బయోపిక్ . తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన అలనాటి సాటిలేని మేటి గొప్ప నటుడు ఎన్టీఆర్. బాలకృష్ణ ఎన్టీఆర్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మొదట దర్శకుడు తేజ ఈ చిత్రానికి డైరెక్టర్ గా అనుకున్నారు, కాని కొన్ని అనివార్య కారణాల వల్ల తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ బాధ్యతలని చేపట్టారు.

బాలకృష్ణ ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు తానే స్వయంగా నటీ నటుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటిస్తున్నారు. సావిత్రిగా కీర్తి సురేష్ – హెచ్ ఎం రెడ్డిగా ప్రకాష్ రాజ్, కైకాల సత్యనారాయణ, మోహన్ బాబు నటిస్తున్నారు. రకుల్ శ్రీదేవి పాత్రలో నటిస్తున్నదని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ హైద్రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.

ఎన్టీఆర్ అంటే సినీరంగంలోనే కాకుండా, రాజకీయాలలో గల్లీ నుండి ఢిల్లీ దాకా తెలుగోడి పౌరుషాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తీ కూడా , కాబట్టి ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ కి ఉన్న ఆ క్రేజుకు తగ్గట్టే ఒక పెద్ద బంపర్ ఆఫర్ వచ్చిందని ఫిలిం నగర్ లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే అన్ని భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు హక్కుల్ని ఛేజిక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీపడుతున్నాయి. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్- సోని పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా అన్నిభాషలలో  రిలీజ్ కి కలిపి రూ. 80 కోట్ల భారీ ఆఫర్ చేశారని తెలుస్తోంది. కానీ బాలయ్య ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. సినీ వర్గాల ప్రకారం.. ఎన్టీఆర్ బయోపిక్‌కు ఇంతకంటే భారీ మొత్తంలో ఆఫర్‌ దక్కవచ్చనే అంచనా వేస్తున్నట్టు సమాచారం. మరి ఇన్ని అంచనాలను రేపుతున్న మహానటుడి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

 

 

 

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)