ట్రైలర్ తో మనసు దోచిన సుదీర్ బాబు
ప్రిన్స్ మహేష్ బాబు బావమరిది, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా టాలీవుడ్ లో శివ మనసులో శృతి(SMS) అనే మూవీతో హీరోగా తెరంగేట్రం చేసాడు. అంతకంటే ముందు ఏం మాయ చేసావే మోవిఎలో సమంతా అన్నయ్యగా నటించాడు. ప్రేమకథా చిత్రమ్ సుదీర్ బాబు కెరీర్ లో ఫస్ట్ హిట్ కొట్టిన మూవీ, ఆ తరువాత శమంతకమణి మూవీ కూడా సుదీర్ కెరీర్ లో బెస్ట్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ లో వర్షం మూవీకి రీమేక్ గా తీసిన భాఘీ అనే మూవీలో విలన్ పాత్రలో నటించాడు. టైగర్ ష్రాప్ఇందులో హీరోగా నటించాడు రీసెంట్ గా ‘సమ్మోహనం’ చిత్రంతో ప్రేక్షకులని ఆకట్టుకున్న హీరో సుధీర్ బాబు ఇప్పుడు నిర్మాతగా కూడా మారాడు.
సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘nannu dochukunduvate ’. ఈ మూవీ ట్రైలర్ సోమవారం నాడు సాయంత్రం 5:02గంటలకు బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాప్ చేతులు మీదుగా రిలీజ్ చేసారు.ఇది ఒక లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుoది. ఆర్ ఎస్ నాయుడు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. కథ, స్క్రీన్, ప్లే దర్శకత్వం అన్ని ఆయన భుజాలపై వేసుకొని మరి ఈ సినిమాను తెరకేక్కిస్తున్నారు. ఈచిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకులముందుకు రానుంది.
మంచి తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే టైటిల్ ని పెట్టడం ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్. సీనియర్ ఎన్టీఆర్ ‘గులేబకావళి’ సినిమాలో ఎప్పటికి గుర్తుండిపోయే ‘nannu dochukunduvate’ అనే అద్భుతమైన పాట మొదటి పదాన్ని టైటిల్ గా పెట్టాడు. ట్రైలర్‌లో సాఫ్ట్ వేర్ కంపెనీకి మేనేజర్‌గా స్టాఫ్ మొత్తాన్ని హడలెత్తించే బాస్ గా కనిపించాడు. రెండు నిముషాలు ఉన్న ఈ ట్రైలర్ లో మొత్తం nannu dochukunduvate కంటెంట్ ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేసాడు. హీరోయిన్ నభా నటేష్ అల్లరి పిల్లగా చక్కగా పెర్ఫామ్ చేసింది. ట్రైలర్ లో అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలైట్ అయ్యేలా కనిపిస్తుంది. ట్రైలర్ ఒక మంచి ఫీల్ తో ఆకట్టుకుంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.