నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ


నటీనటులు : సుధీర్‌ బాబు, నభ నటాషా, సుదర్శన్,నాజర్, తులసి, షన్ముక్, వేణు తదితరులు

సంగీతం : బి. ఎ.లోకనాథ్

ఎడిటింగ్ : చోటా కే.ప్రసాద్

సినిమాటోగ్రఫి: సురేష్ రగుతు

దర్శకత్వం : ఆర్.ఎస్. నాయుడు

నిర్మాతలు : సుధీర్ బాబు

సూపర్‌ స్టార్‌ ప్రిన్స్ మహేష్ బాబు బావమరిదిగా టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఆ తరువాత హీరోగా తన టాలెంట్ ని నిరూపించుకుంటున్న యంగ్ హీరో సుధీర్‌ బాబు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మల్టీస్టారర్‌ సినిమాలతో పాటు విలన్ పాత్రలతో కూడా ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేసాడు ఇటీవల సమ్మోహనంతో సూపర్‌ హిట్ కొట్టిన సుధీర్‌ బాబు తాజాగా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి ‘సుధీర్ బాబు ప్రొడక్షన్స్’ ద్వారా తానే స్వయంగా నటిస్తూ నిర్మించిన సినిమా “నన్ను దోచుకుందువటే”. నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో  కన్నడ భామ నభా నతేష్ హీరోయిన్ గా, నాజర్, తులసి, వేణు ముఖ్య పాత్రల్లో నటించిన నన్ను దోచుకుందువటే టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో సుధీర్ బాబు మరో విజయం అందుకున్నాడా? మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:
కథలోకి వెళ్తే హీరో కార్తీక్ (సుధీర్ బాబు) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్. చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు. తన తోటి ఉద్యోగులు అంతా కార్తీక్ వారితో స్ట్రిక్ట్ గా ఉండడంతో అతడిని చూసి  భయపడేవాళ్ళు. తన గోల్ తప్ప కుటుంబాన్ని, చుట్టూపక్కలవాళ్ళని కూడా పట్టించుకునే వాడు కాదు.  అలాంటి వ్యక్తి అమెరికా వెళ్లి తన గోల్ ని ఎలాగైనా సాధించాలని కలలు కంటూ ప్లాన్ చేసుకుంటుంటాడు.  కార్తీక్ తండ్రి తన మరదలితో పెళ్లి చేయాలని చూడడం మేఘన (నభ నటేష్)అనే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ని తన గర్ల్ ఫ్రెండ్ గా పేరెంట్స్ కి పరిచయం చేస్తాడు. ఈ క్రమంలో ఆమె కార్తీక్ కు దగ్గరవుతుంది. కార్తీక్ కూడా ఆమెను ఇష్టపడతాడు

కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేయరు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కార్తీక్ మేఘనను దూరంగా పెట్టాలని అనుకుంటాడు. కార్తీక్ తను అనుకున్న  గోల్ రీచ్ అవుతాడా ? చివరికి కార్తీక్ మేఘన కలుసుకుంటారా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే

విశ్లేషణ:
‘nannu dochukunduvate’ గురించి చెప్పాలంటే ఇది ఒక మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్. లవ్‌, కామెడీ, రొమాన్స్‌, సెంటిమెంట్‌ ఇలా అన్ని ఎమోషన్స్‌ సమపాళ్ళలో ఉన్న ఒక బ్యూటిఫుల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ రొటీన్ గా ఉన్నప్పటికీ దానిని వైవిధ్యంగా చూపించడంలో దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ లో ఆఫీస్‌ సీన్స్ తో పాటు, హీరోయిన్‌తో లవ్‌ సీన్స్ తో సినిమా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. అయితే కథనం ఇంకాస్త వేగంగా ఉంటే బాగుండనిపిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యువతకి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అదే ‘nannu dochukunduvate’లో ప్లస్ పాయింట్. అక్కడక్కడా కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ ప్రేక్షకులకి ఈ ఫీల్ కలుగుతుంది. హీరోహీరోయిన్లు, వైవా హర్ష మధ్య వచ్చే కామెడీ సీన్ సినిమాకి ప్లస్ పాయింట్. సుధీర్ బాబు తన యాక్టింగ్‌తో ప్రేక్షకులు మనసారా నవ్వుకుంటారు. ప్రీక్లైమాక్స్ లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగమైన సీన్స్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. పాటలు పర్వాలేదనిపించినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. సురేష్‌ సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. ఎడిటింగ్‌ నిరాశపరిచింది. సుధీర్‌ బాబు సొంత సినిమా కావటంతో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా మంచి అవుట్‌పుట్‌ ఇచ్చేందుకు కష్టపడ్డాడు.
నటీనటులు:
యంగ్ హీరో సుధీర్ బాబు కేవలం తన గోల్ సాధించాలనే తపనతో కష్టపడే యువకుడి పాత్రలో సుధీర్ బాబు అద్భుతంగా నటించారు. కామెడీ సీన్లలో అతడి యాక్టింగ్ సూపర్బ్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో సుధీర్ బాబు మంచి కాన్ఫిడెంట్ గా నటించాడు. హీరోయిన్ విషయానికి వస్తే కన్నడ భామ నభా నతేష్ తెలుగులో డెబ్యు మూవీ అయినప్పటికీ అద్భుతంగా నటించింది. తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కార్తీక్ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు నాజర్ ఎప్పటిలాగే నటించారు అనడం కంటే జీవించారు అంటే బాగుంటుంది. హీరోయిన్ తల్లి పాత్రలోసీనియర్ నటి తులసి కూడా బాగా నటించింది. వైవా హర్ష కామెడీ బాగుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

ముఖ్యంగా చెప్పవలసింది సినిమాలోని సుధీర్ బాబు ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా బాగున్నాయి. దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు తన రాసుకున్న రొటీన్ కథను కొద్దిగా వైవిధ్యంగా, అందంగా స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేశారు. కాకపొతే సెకండ్ హాఫ్ పైన పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. లోకనాథ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోదు. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. చోట.కె ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని కొన్ని ఇంకాస్త ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

సుధీర్ బాబు, నభా నటేష్ యాక్టింగ్

కథ, కథనాలు

కామెడీ

సెంటిమెంట్

సినిమాటోగ్రఫి

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

నెమ్మదిగా సాగే కథనం

తీర్పు : మొత్తం మీద ఈ సినిమా మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు బెస్ట్ ఛాయిస్.

ఈ వీకెండ్ ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన nannu dochukunduvate సినిమాని హ్యాపీగా చూసేయొచ్చు.

 

Please follow and like us:
0

You may also like...

1 Response

  1. Singer babu says:

    Ilati movies ni inka chala cheyalani nirmathaga manchi laabalu raavalani ah allah ni korukuntunanu anteeeeeee (sudherbabu) meeru ekkda thaga kandiii mee talent ni meeru namukondiiii all-round anela undiiiiii mee talent 👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🤝
    challenge gaa thisukoni

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)