telugu movies information

ఆ రెండు సినిమాలకి పోలికే లేదంటున్న ఎంపీ కవిత

పెళ్లయితే హీరోయిన్స్ తమ కెరీర్‌ కు గుడ్ బై చెప్పినట్టే అనుకుంటారు. ఒకవేళ కొనసాగితే ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు కూడా తగ్గే ఛాన్స్ ఎక్కువ. దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ట్రెండ్ అది. కాని టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతా మాత్రం ఇందుకు మినహాయింపు అనే చెప్పాలి. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన నటనతో, అందంతో అందరిని మాయ చేసిన అందాల భామ సమంత. సమంత, నాగచైతన్య ని వివాహం చేసుకొని అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యిoది. పెళ్లయ్యాక తన కెరీర్ మరింత జోరందుకుంటోంది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. టాలీవుడ్‌లో చై మరియు సామ్ ఈ జనరేషన్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్.  త్వరలో పెళ్లి తరువాత వీరిద్దరూ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

ఇప్పుడు ఆమె నటించిన మొదటి లేడీ ఓరియెంటెడ్ మూవీకన్నడ సినిమా రీమేక్ గా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘u turn’ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను నిజంగానే థ్రిల్ కి గురి చేస్తుంది. పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి రాంబాబు బండారు ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ u turn మూవీ సక్సెస్ మీట్ హైదరాబాదులో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సినిమా గురించి, సమంతా నటన గురించి ఎంపీ కవిత మాట్లాడుతూ ‘‘యూటర్న్ మూవీ చాలా మంచి సినిమా. ఈ సినిమా ద్వారా సమాజానికి ఇచ్చిన మెసేజ్ ద్వారా ప్రజలలో కనువిప్పు కలగాలి అని అన్నారు. డివైడర్ ని క్రాస్ చేసి యూటర్న్ తీసుకోవడానికి ఇకముందు ఎవరు ప్రయత్నించరు. నేను ఈ సినిమాని ఇంకా చూడలేదు. మా పిల్లలు ఈ సినిమా చూసి సినిమా గురించి మంచి రివ్యూ ఇచ్చారు.

తాను ‘రంగస్థలం’ సినిమా చూశానని అందులోని రామలక్ష్మి పాత్రకు ఇప్పుడు ‘u turn’లోని రచన పాత్రకు అసలు పోలికే లేదని ఇంత వైవిధ్యం అందరికీ సాధ్యం కాదని కవిత అన్నారు. ఆధునిక మహిళకు అసలైన ప్రతిబింబం సమంత అని ఆమె కవిత అంది. సమంత గొప్ప మానవతా వాది. తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్నారు. అలాగే తెలంగాణ హ్యాండ్లూమ్స్ కు సమంత బ్రాండ్ అంబాసిడర్ గా తెలంగాణ చేనేతకు గుర్తింపు తెచ్చారు. అంటూ సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే తరహాలో చిత్ర దర్శకుడు హెల్మెట్ ప్రాధాన్యాన్ని చాటి చెప్పే సినిమా కూడా తీయాలని కోరుకుంటున్నానని కవిత అన్నారు. త్వరలోనే తాను కూడా ‘యూటర్న్’ సినిమా చూస్తానని ఆమె చెప్పారు. సమంత, నాగచైతన్య నటించిన సినిమా రెండు ఒకే రోజున విడుదల కావడం, రెండు సినిమాలు బాగున్నాయని టాక్ రావడం శుభపరిణామనని చెప్పారు.  సమంత,  చైతన్యల మధ్య ఇంట్లోను బయట ఆరోగ్యకరమైన వాతావరణం ఉందని ఆమె అన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Back to top button
Close
Close