విజయ దేవరకొండ కోసం రాబోతున్న మెగాస్టార్?

“పెళ్లి పీటలు” అనే చిన్న సినిమాలో హీరోగా కనిపించి మంచి మార్కులు కొట్టేసిన విజయ దేవరకొండకు “అర్జున్ రెడ్డి’ సినిమా ఒక్కసారిగా యూత్ లో ఎక్కడలేని క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఈ హీరో రాబోయే సినిమా గీత గోవిందం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు. ‘ఛలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న ‘గీత గోవిందం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి మరింత ప్రచారం కల్పించేందుకు ఈనెల 12న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు.

రోమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీకి ఇప్పటికే ఫుల్ క్రేజ్ వచ్చింది. యు ట్యూబ్ లో విడుదలైన ట్రైలర్లు- టీజర్లు -ఫస్ట్ లుక్ లు అన్ని ఇప్పటికే ఆడియన్స్ ని మాయ చేసాయి. ఇప్పుడు ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు చూస్తున్నారు. అందుకే విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ‘గీత గోవిందం’కు భారీ ప్రచారం కల్పిస్తున్నారు. ఆడియో ఫంక్షన్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా వచ్చాడు. ప్రీ రిలీజ్ వేడుకను విశాఖపట్నంలో జరపాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టు సమాచారం. బావమరిది అల్లు అరవింద్ కోరిక మేరకు చిరు ఈ ఫంక్షన్ కు వస్తున్నట్టు టాలీవుడ్ నుంచి వార్తలొస్తున్నాయి. ఈ వార్త తెలిసి విజయ్ దేవరకొండ ఫుల్ ఖుషిగా ఉన్నాడని తెలిసింది. ఒక వేళ ఇది నిజమైతే ఒకే వేదికపై మెగాస్టార్ చిరు, విజయ్ దేవరకొండను అభిమానులు చూడవచ్చు.

ఈ ఇద్దరిలోనూ ఒక పోలిక ఉంది. ఇద్దరూ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదిగారు. అయితే ఈ న్యూస్ పై అధికారికంగా  అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ గీత గోవిందం మూవీకి ఇంత భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ మానియా సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వెయిట్ అండ్ వాచ్. అయితే ఇప్పుడు ముందు మన మెగాస్టార్ గీత గోవిందం గురించి ఏమి మాట్లాడతాడో అనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా ఉoది.

 

 

AddThis Sharing Buttons

Share to FacebookShare to TwitterShare to WhatsAppShare to EmailShare to Moreగీతా గోవిందాం యొక్క పూర్వ-విడుదల కార్యక్రమం ఆగస్టు 12 న వైజాగ్ బీచ్లో జరుగుతుంది. ఈ చిత్రం విడుదలైన కొద్దిరోజుల పాటు భారీగా పెరిగిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి ప

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)