జపాన్ లో పాగా వేసిన “మగధీర” మూవీ

టాలీవుడ్ లో అపజయం అనే పదానికి అర్ధం తెలియని ఒకే ఒక్కడు రాజమౌళి. ముద్దుపేరు జక్కన్న. ఏ సినిమా తీసిన రికార్డ్స్ ని బ్రేక్ చేయాల్సిందే. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ చిరుత మూవీ తరువాత చరణ్ , దర్శకధీరుడు రాజమౌళి వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘magadheera’ సినిమా 2009 లో రిలీజ్ అయి అప్పటి బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ ని సృష్టిoచింది. తొమ్మిది సంవత్సరాల తరువాత ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మళ్ళీ ఈ magadheera సినిమా ఇప్పుడు జపాన్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోందట.  జపాన్ లో మన తెలుగు సినిమాలకి మంచి మార్కెట్ ఉంది.

రజనీకాంత్ ప్రతి మూవీ దాదాపుగా జపాన్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇప్పటికే జాతీయస్థాయిలో తెలుగు సినిమా స్టామినాని తెలిపిన ‘బాహుబాలి’ సినిమా జపాన్ లో కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు రాజమౌళి దర్శకత్వం వహించిన గత చిత్రాలకు డిమాండ్ భారీగా పెరిగింది. దాంతో ఇప్పుడు ‘మగధీర’ జపనీస్ వెర్షన్ ను ఆగష్టు 30 తేదీన రిలీజ్ చేసారు.  అక్కడ కూడా ఆ సినిమా ప్రభంజనాన్ని సృష్టిస్తుందట.

జపాన్ లో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాల లిస్టులో సూపర్ స్టార్ రజనికాంత్ సినిమా ‘ముత్తు’ $1.6 మిలియన్స్ తో మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో ‘బాహుబలి’ $1.2 మిలియన్స్ సాధించి రెండవ స్థానంలో ఉంది. ఇప్పుడు magadheera మూవీ జపాన్ లో $1 మిలియన్  కలెక్షన్ మార్కుకు అతి దగ్గరలో ఉంది. త్వరలో బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టేలా కనిపిస్తుంది. అదే కాని జరిగితే 21 ఏళ్ళ క్రితం ‘ముత్తు’  రికార్డుకు ఎసరుపెట్టినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు.
ఈ మగధీర సినిమా మొదటి నాలుగు రోజుల్లో 1.06 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)