Tollywood news in telugu

Kaliyuga telugu movie (2019) review raging

Kaliyuga movie review raging

రివ్యూ: కలియుగ
నటీనటులు : విశ్వా, స్వాతి దీక్షిత్, శశి కుమార్
దర్శకత్వం : ఎం ఏ తిరుపతి
నిర్మాత‌లు : సి హెచ్ సుబ్రమణ్యం
సంగీతం : కమల్.డి
సినిమాటోగ్రఫర్ : సత్య వి ప్రభాకర్

విశ్వ, స్వాతి దీక్షిత్ జంటగా, తిరుపతి దర్శకత్వంలో బాలాజీ సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌ పై, నటుడు సూర్య నిర్మించిన సినిమా ‘కలియుగ’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:
వెంకట్ (సూర్య) ప్రకాష్ (శశి కుమార్ రాజేంద్రన్) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ప్రకాష్ ను వెంకట్ ప్రాణంగా నమ్ముతాడు. అతని కోసం ప్రాణాలనైనా ఇవ్వటానికి సిద్ధపడతాడు. అయితే సడెన్ గా వెంకటే, ప్రకాష్ ను అతి దారుణంగా కాల్చి చంపేస్తాడు. పోలీస్ లు వెంకట్ ను పట్టుకునే క్రమంలో.. చందు (విశ్వ) అనే మరో వ్యక్తి ప్రకాష్ ను చంపింది నేను అంటూ పోలీస్ లకు లొంగిపోతాడు. ఇంతకీ ఈ చందు ఎవరు ? ఇతనికీ వెంకట్ కి సంబంధం ఏమిటి ? అసలు ఇంతకీ ప్రాణ స్నేహితుడైన ప్రకాష్ ను వెంకట్ ఎందుకు చంపాడు ? ప్రకాష్ వెనుక ఉన్న కథ ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సూర్య తన పాత్రకు తగ్గట్లు తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా తన చెల్లి చనిపోయే సన్నివేశంలో అలాగే ఫ్రెండ్ ను చంపే సీన్ లో సూర్య నటన బాగుంది. ఇక మరో కీలక పాత్రలో నటించిన విశ్వ కూడా చాల బాగా నటించాడు. హీరోయిన్ కాలిపోతున్న సన్నివేశంలో గాని, ఆమె కోసం పిచ్చోడిలా తిరిగే సీన్స్ లో మరియు క్లైమాక్స్ విశ్వ నటన ఆకట్టుకుంటుంది.

హీరో సూర్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ గా నటించిన స్వాతి దీక్షిత్ తన పాత్రలో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. విలన్ గా నటించిన శశి కుమార్ రాజేంద్రన్ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. దర్శకుడు తిరుపతి తీసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్ బాగుంది. ఆయన రాసుకున్న కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. సినిమాలో ల్యాగ్ లేదు, గ్రిప్పింగ్ గా ఉండడంతో సినిమా ఎక్కడా బోర్ లేదు. సినిమాటోగ్రఫీ కొత్తగా అనిపిస్తోంది, ఫ్రెమింగ్స్ బావున్నాయి. ఇక నిర్మాత సి హెచ్ సుబ్రమణ్యం పాటించిన నిర్మాణ విలువలు సినిమాకు ఆదనవు ఆకర్షణగా నిలిచాయి.

కలియుగ అంటూ వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. మెయిన్ స్టోరీ పాయింట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సినిమాలో కథాకథనాలు సూపర్ గా ఉన్నాయి. సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా కలియుగ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసే వారికి ఎలాంటి శిక్షలు విధించాలి ? అమాయక ఆడపిల్లలు కొంతమంది రౌడీ మూకల చేతిలో ఎలా బలి అవుతున్నారు ? అలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పాలి ? వంటి కీలక అంశాలు కలయుగ సినిమాలో ప్రస్తావించడం జరిగింది.

రేటింగ్: 4/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button