Tollywood news in telugu

ఈమేనా అసలు ఐరన్ లేడీ???


అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ఎటు చూసినా ఎక్కువగా బయోపిక్‌ల హవా నడుస్తోందిప్పుడు. తెలుగులో మహానటి సావిత్రి జీవితాన్ని అద్భుతంగా ‘మహానటి’ అనే సినిమాతో వెండితెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ బయోపిక్ కి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఇప్పుడు అదే కోవలో ఈ సంక్రాంతికి మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బాలయ్య. బాలీవుడ్ లో ఎక్కువగా క్రీడాకారుల రియల్ లైఫ్ ను రీల్ లైఫ్ లో చూపించారు. మేరికోం, సూర్మా, సచిన్ టెండూల్కర్, ధోని మొదలైన గొప్ప స్పోర్ట్స్ పర్సన్స్ జీవితాలను తెరకెక్కించారు.
ఇప్పుడు దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి, తమిళ ప్రజల ఆరాధ్య దైవం, అందరి గుండెల్లో అమ్మగా స్థానం సంపాదించుకున్న గొప్ప మహిళ జయలలిత జీవితం ఆధారంగా త్వరలో ఒకటి కాదు రెండు బయోపిక్స్ రాబోతున్నాయి. ఇవి రెండు ఒకదాని తరువాత ఒకటి రెడీ అవుతాయి. ఇందులో ఒక బయోపిక్ ని A. ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ the iron lady టైటిల్ పాత్రను పోషించే అవకాశo కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ ఒక టైటిల్ పోస్టర్‌ని కూడా ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్ మురుగదాస్ ట్విట్టర్ ద్వారా లాంచ్ చేశారు. ‘‘the iron lady’’ అనే టైటిల్‌ ని ఈ బయోపిక్ కి ఖరారు చేసారు. పేపర్‌టేల్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ప్రియదర్శిని దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరుగనుందని కూడా పోస్టర్‌లో పేర్కొన్నారు

ఈ the iron lady టైటిల్ పై ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ట్విట్టర్ లో స్పందించారు. ఈ బయోపిక్ టైటిల్ ని లాంచ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రియదర్శిని, వరలక్ష్మి శరత్ కుమార్ మరియు చిత్ర యూనిట్ కి సినిమా ఘన విజయం సాధించాలని ఆయన యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.జయలలిత గారి మరొక బయోపిక్ ని డైరెక్టర్ విజయ్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విబ్రి మీడియా ద్వారా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ టు బొత్ టీమ్స్.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button