సీనియర్ హీరోయిన్ తో సరిపెట్టుకున్న యువ హీరో

కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్. చిరంజీవితో సహా అందరి స్టార్ హీరోలతో నటించేసింది. అలాంటి ఈమె కెరీర్ గత రెండేళ్ళుగా బాగా నెమ్మదించింది. అవకాశాలు తగ్గినా వచ్చిన వాటిని అందిపుచ్చుకుని చిన్న హీరోల సరసన సైతం నటిస్స్తోంది. అలా, తన తొలి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘MLA’ చేసింది. తెలుగులో రాణా తో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ తరువాత ‘MLA’ చేసింది. ఆ సినిమా పెద్దగా కలిసి రాకపోవడంతో కొంత విరామం తప్పలేదు కాజల్ కి. ఇప్పుడు తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది.

అసలు చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్ అవరన్నది ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా తెలియలేదు. ఎందుకంటే, బెల్లంకొండ శ్రీనివాస్, సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ కావాలని పట్టు బట్టాడు. కానీ దర్శకుడు తేజ, తనకు గోల్డెన్ లెగ్ అయిన కాజల్ అగర్వాల్ నే ఎంచుకున్నాడు. ఈ రోజు ముహూర్తపు సన్నివేశానికి శ్రీనివాస్ తో కలిసి ఆమె వచ్చే సరికి క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి దర్శకుడు తేజ తన పంతం నెగ్గించుకున్నాడన్న మాట.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో రావాల్సిన హిట్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ సరైన విజయం లేదు. అతని కొత్త చిత్రం ‘సాక్ష్యం’ మరి కొద్ది రోజులలో విడుదల కానుంది. పూజ హెగ్డే ఈ సినిమాలో శ్రీనివాస్ కు జోడీగా నటించింది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)