భారతీయ నటీనటుల దేవాలయాలు

భారతీయ సినీపరిశ్రమలో ఎంతో మంది గొప్ప గొప్ప నటీనటులు ఉన్నారు. వీరి నటనకు ఇంత పెద్ద గుర్తింపు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. అయితే వీటిలో ఒకటి వారి అభిమానులు. ఫాన్స్ తమకు ఇష్టమైన నటుడిని దేవుడితో సమానంగా పూజిస్తున్న్తారు. వాళ్ల అభిమానానికి అవధులు అనేవి ఉండవనే చెప్పాలి. కానీ ఇంకా కొంతమంది వారి అభిమానాన్ని నిజంగా చూపించడానికి తమ అభిమాన నటుడి కోసం దేవాలయాలు కూడా కట్టించడం మొదలు పెట్టారు. వినడానికి ఇది విచిత్రoగా అనిపించినప్పటికీ, ఇండియాలో చాలా మంది నటీనటుల ఆలయాలు నిర్మించడం ఇప్పుడు అలవాటుగా  మారింది. ఈ రకమైన ధోరణి ముందుగా తమిళనాడులో మొదలైంది, ఆ తరువాత భారతదేశం అంతటా వ్యాపించింది. మరి అలా తమ అభిమానుల దృష్టిలో దేవుళ్ళుగా మారి పూజింపబడుతున్న  ఆ నటీనటులు ఎవరు? వారి దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

  1. తమిళనాడులోని వెల్లూరులో కరుణానిధి ఆలయం:

నటుడిగా మారిన ప్రముఖ రాజకీయ నాయకుడు కరుణానిధి. ఈయనకు తమిళనాడులోని వెల్లూరులో ఒక రాజకీయవేత్త అయిన జి.ఆర్. కృష్ణమూర్తి ఈ ఆలయాన్ని నిర్మించారు, దీనిని కలియగ్నర్ తిరోక్ కోవిల్ అని పిలుస్తారు. ఈ దేవాలయంలో కరుణానిధి యొక్క గ్రానైట్ విగ్రహం ఉంది మరియు అతని కుమారుడు స్టాలిన్ ముఖo ఉన్న గోడలు చెక్కబడ్డాయి.

  1. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో కుష్బూ ఆలయం

కుష్బూ సుందర్ కోలీవుడ్ లో అతిపెద్ద నటి. ఆమె అభిమానులు తమ అభిమానాన్ని చాటుకోవడానికి తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఒక ఆలయాన్ని నిర్మించారు.నటీమణి ప్రీ-మారిటల్  సెక్స్ మరియు ఎయిడ్స్ గురించి తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆమె అభిమానులలో చాలా కోపం మరియు వేదన ఏర్పడింది. దానితో అభిమానులు ఈ ఆలయాన్ని నాశనం చేశారు.

  1. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో మమతా కులకర్ణి ఆలయం

ఈమె ఒక బాలీవుడ్ నటి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు అభిమానులు మరియు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈమె కోసం దేవాలయం నిర్మించారు. తెలుగు నటి కాకపోయిన తెలుగు మాట్లాడే రాష్ట్రంలో ఒక ఆలయాన్ని కలిగి ఉండడం చాలా ఆశ్చర్యకరం.

  1. తమిళనాడులోని నాథమేడులో M. జి. రామచంద్రన్ ఆలయం

5. G. R. ఒక సూపర్ స్టార్, అతను తన అపార జనాదరణ కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులోని నాథమేడులో అతని అభిమానులు ఒక దేవాలయాన్ని అతని పేరు మీద నిర్మించారు మరియు ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడి మరణిoచినందున అతని భార్య ఈ ఆలయాన్ని ప్రారంభించారు.

6.పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో అమితాబ్ బచ్చన్ ఆలయం

అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో అతి పెద్ద నటులలో ఒకరు, అతని పేరుతో ఒక ఆలయం ఉండడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. నిజానికి ఎవరూ ఆశ్చర్యం ఉండేవి. కలకత్తాలో ఉన్న ఈ ఆలయంలో ప్రధాన పూజారి మరియు ఒక విగ్రహం ఉంటుంది. బచన్ ఫోటోలు కలిగి ఉన్న ఈ దేవాలయంలో ఉదయం పూట పూజ కూడా చేస్తారు.

7. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ ఆలయం

ఎన్.టి.ఆర్ కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఆలయం కలిగి ఉన్న ఏకైక తెలుగు నటుడు. శ్రీకాకుళం శిల్పకళాకారుడు శేఖలకా శంకర్, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ పేరు పెట్టబడిన ఒక ఆలయం మరియు పాఠశాలను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అయితే, 2016 మధ్యకాలంలో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.

8. శ్రీలంకలోని కొలంబోలో పూజా ఉమాశంకర్ ఆలయం

ఇండో-లంక నటి పూజా ఉమాశంకర్ కోసం శ్రీలంక ప్రజలు కొలంబోలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఫారెన్ లో ఆలయం ఉన్న ఏకైక భారతీయ నటి.

9. కర్నాటకలోని కోలార్ లో రజినీకాంత్ ఆలయం

సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ కు ఆలయం లేనట్లయితే అది నిజంగానే షాక్. అయితే, ఈ ఆలయం కర్నాటకలోని కోలార్ లో ఉంది. ఇది సూపర్ స్టార్ అభిమానులకు సరిహద్దులు తెలియదు అని చూపిస్తుంది. అభిమానులు ఆలయం మధ్యలో ఒక పెద్ద శివలింగం ఉంచి వాటి చుట్టూ ఒక కోటి శివ లింగాలను స్థాపించారు. ఈ ఆలయం సంయుక్తంగా రజనీ సోదరుడు సత్యనారాయణ రావు మరియు స్టార్ రాజ్ బహదూర్ ప్రారంభించారు.

10. తమిళనాడులో నగ్మా ఆలయం

నగ్మా తన అందం, అభినయంతో అనేకమంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిoది. ఆమె అపూర్వమైన విజయం కారణంగా అభిమానులు ఆమెకు  ఒక ఆలయాన్ని నిర్మించారు. అయితే, ఆమె కీర్తి క్షీణించింది మరియు ఆలయం కూడా  అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఈ దేవాలయం ఎక్కడుందో తెలియదు. అయినప్పటికీ, ఈ ఆలయం తమిళనాడులోనే ఉంది.

11. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులోని నందమూరి తారక రామరావు ఆలయం,

ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఒక లెజెండ్. అతని భారీ అభిమానం మరియు అపారమైన నమ్మకం అతన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసింది. తన అభిమాన నటుడు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో ఒక ఆలయాన్ని నిర్మించారు.

12. తమిళనాడులోని తిరునల్వేలిలో నమిత ఆలయం

నమిత తమిళనాడులో బాగా ప్రజాదరణ పొందిన నటి. ఆమె అభిమానులు ఆమెను  గౌరవించటానికి ఆలయం నిర్మించారు మరియు నమిత కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆలయం తమిళనాడులోని తిరునల్వేలిలో ఉంది.

 

 

 

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)