telugu facts

నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీరు సిగ్గుపడుతున్నారా?? అయితే దానిని అధిగమించడం ఎలా?

సిగ్గుపడడం దీనినే ఇంగ్లీష్ లో “షై నెస్” అని కూడా అంటారు. సిగ్గుపడడం అనేది మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఏదో ఒక సమయంలో ఫీల్ అయ్యే ఉంటారు. ఈ సిగ్గుపడటం అనేది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా మాటలు తడబడటం, చేతులు వణకడం, అరచేతులకి చెమటలు పట్టడం, మాట్లాడేటప్పుడు మాటల్ని వెతుక్కోవడం, మొదలైనవిగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ shyness అనేది ఎలా వస్తుంది? ఎక్కడ నుండి వస్తుంది? కొన్ని సందర్భాల్లో, మనలోని జీన్స్ నుండి సంక్రమిస్తుంది. పిరికిగా, సిగ్గుగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు కూడా సహజంగా తాము పిరికిగానే ఉంటారు. మన చుట్టూ ఉన్న సోషల్ ఎన్విరాన్మెంట్ లేదా మన గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా మనo  సిగ్గు పడేలా చేస్తాయి. ఉదాహరణకు, మీరు సున్నితమైన మనస్సు కలిగిన పిల్లవాడు లేదా పిల్ల అయిఉంటే, మీ టీచర్ క్లాసులో మీరు తప్పు సమాధానం ఇవ్వడంతో  మిమ్మల్ని హేళన చేస్తే, భవిష్యత్తులో ఇంకెప్పుడు మీరు సమాధానం ఇవ్వడానికి మీ చేతిని పైకి ఎత్తలేరు.

shyness అనే దానికి మూల కారణం మన మీద మనకు ఉన్న సందేహం లేదా డౌట్. అదే మనపై మనమే ఓడిపోవడానికి దారితీస్తుంది. వృత్తిపరంగా కూడా చాలామంది తమ పై అధికారులకు తమకున్న ముఖ్యమైన అవసరాలు మరియు వారి లక్ష్యాల గురించి వ్యక్తం చేయాలంటే shyness లేదా భయపడుతుంటారు. సొసైటీలోకి వెళ్ళినపుడు, మనం కలవాలి అనుకునే ఒక ముఖ్యమైన వ్యక్తికీ ధైర్యంగా ముందుకు వెళ్లి “హలో” అని కూడా చెప్పలేము. దానికి కూడా ఈ షై నెస్ అనేది కారణం కావచ్చు.

చాలా తరచుగా కాకపోయినా  ప్రతి ఒక్కరీ కళ్ళు మనన్లే చూస్తున్నారని చాలా మంది భావిస్తుoటారు, వారు చేసే ప్రతి చిన్న పనిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు మరియు వారీ అలవాట్లు, పద్ధతులు అన్నింటిని ఎవరో గమనిస్తున్నట్టు అనుకుంటారు. తత్ఫలితంగా, ఎక్కువగా బయటకు వెళ్ళకుండా ఉండడం, నలుగురిలో కలవడం మానివేయడం మరియు మీటింగ్స్ లలో తమని తాము ఇతరులతో పరిచయం చేసుకోవడానికి కాని, తమ ఆలోచనలను, అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి మరియు చొరవ తీసుకోవడానికి అసలు ఆసక్తిని చూపించరు.

కాబట్టి మీరు ఈ shyness ని అధిగమించడానికి మరియు ఈ ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు క్రింద చెప్పబోయే కొన్ని చిట్కాలు మీకు సహాయం చేస్తాయి.

  1. పరిస్థితుల నుండి తప్పించుకోవద్దు:

తరచుగా ఈ సిగ్గుపడడం అనేది మనం కొన్ని పరిస్థితుల నుండి తప్పించుకొని తిరిగేలా చేస్తుంది. ఉదాహరణకు, చాలామంది తెలియని అతిధులు ఉన్న ఒక పార్టీకి హాజరయ్యే అవకాశంవచ్చినప్పుడు, గ్రూప్ డిస్కషన్ లో పాల్గొనడం మరియు వారితో మాట్లాడడం మంచిది. ఇది మనం ముందుకు వెళ్లి వచ్చిన అవకాశాన్ని యూస్ చేసుకోవడం మంచిది.

  1. థింక్ పాజిటివ్:

సానుకూలoగా ఆలోచిoచడo అనేది మీరు ఎలాంటి కష్టాలనైనా జయిoచడానికి సహాయపడుతుoది. మీపై మీకు వచ్చే సందేహాలను ప్రోత్సహించవద్దు, ఉదా. “ఈ ఫంక్షన్ కి నా డ్రెస్ బాగుంటుందా?” “నేను ప్రెసెంటేషన్ కోసం బాగా ప్రిపేర్ అయ్యానా?” లేక “పార్టీలో నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా?”మొదలైనవి. మీ బాడీ లాంగ్వేజ్ పై శ్రద్ధ చూపoడి – స్నేహపూర్వక చూడండి, ఎదుటివారిని చూడoడి  మరియు స్మైల్ చేయండి.

  1. చిన్న స్టెప్స్ తీసుకోండి

మీరు మీ షైనెస్ ని వదిలించుకోవాలని కోరుకున్నప్పుడు మీ కోసం ఒక పెద్ద గోల్ ని సెట్ చేయవద్దు. మీరు తెలియని వ్యక్తుల ముందు మాట్లాడేటప్పుడు భయపడినట్లయితే, మీ బాగా క్లోజ్ గా ఉండే వారితో (తల్లిదండ్రుల లేదా తాత పుత్రుడి) మాట్లాడడం మొదలుపెట్టండి, ఆపై ఒక చిన్న గ్రూప్ లో ఉండే ఫ్రెండ్స్ తో మాట్లాడండి. అప్పుడు ఎక్కువ మంది ఉన్న చోట మాట్లాడడం సులువు అవుతుంది మరియు కొంత సమయం తరువాత మీ షైనెస్ అదృశ్యమవుతుంది మరియు మీరు స్టేజి ఫియర్ లేకుండా మైక్ ముందు నించొని కూడా మాట్లాడటం ఆనందిస్తారు.

  1. కారణాలను గుర్తించండి:

మీ షైనెస్ కి గల కారణాలని గుర్తించండి. ఇది మీ సాధారణ రూపాన్ని (మీ వికృత జుట్టు, ఊబకాయం మొదలైనవి) లేదా మీలో ఉండే కొన్ని లక్షణాలను లేదా మతిమరుపు వంటి పర్సనాలిటీ ట్రైట్ వీటి కోసం ఏదైనా చెయ్యొచ్చు. ఏది ఏమైనప్పటికీ, మీరు షైనెస్ కి గల కారణాన్ని గుర్తించిన తర్వాత, దానిని సరిదిద్దుకొనే ప్రయత్నం చెయ్యొచ్చు. మీరు ఒక మంచి స్మార్ట్ హెయిర్ కట్ చేయించుకొని, బరువు తగ్గించడానికి, అందంగా కనిపించడానికి ట్రై చెయ్యొచ్చు. మీ స్టామినాని కూడా గమనించవచ్చు. మీలో ఉండే వీక్ పాయింట్స్ ని తెలుసుకొని వాటిని అధిగమించడానికి పనిచేయచేసే గట్టి ప్రయత్నం ఖచ్చితంగా గొప్ప రిజల్ట్ ని ఇస్తుంది. చాలా తరచుగా కాకపోయినా, మీలో ఉండే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ షైనెస్ ని పెంచుతుంది.

  1. గుంపుగా ఉన్న చోట కలవండి:

గుంపులో చేరడం ఎల్లప్పుడూ సులభం. ఎక్కువ మంది కలిసి ఉన్న చోట వెళ్లి వారితో ఫన్నీ గా మాట్లాడడం మొదలు పెట్టాలి.  ఇతరులతో కలిసి నడవండి. తాజాగా జరిగిన  క్రికెట్ మ్యాచ్ గురించి చర్చిస్తూ ఒక పార్టీలో పాల్గొని, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. త్వరలో మీరు మీలో ఉండే ఆ షైనెస్ కనుమరుగవుతుందని భావిస్తారు.

  1. మిమ్మల్ని మీరే అభినందిoచుకోవాలి మరియు మెరుగుపరచడానికి మార్గాలను వెతుక్కోవాలి:

ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ ప్రపంచంలో ఏఒక్కరూ పర్ఫెక్ట్ కాదు – ప్రతి ఒక్కరీలో  మంచి మరియు చెడ్డ క్వాలిటీస్ ఉంటాయి. మొదట, మీలో ఉన్న మంచిని కౌంట్ చేసుకోండి మరియు మీలో ఉండే చెడు లక్షణాలను గుర్తుంచుకోవాలి. అప్పుడు, మీ తప్పులు మరియు వైఫల్యాలను అంగీకరించడo నేర్చుకోండి.

చివరిగా ఈ Shyness ఒక సహజ మరియు సాధారణ లక్షణం మరియు దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button