మీ పిల్లల ఏకాగ్రతను పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసం

చాలామంది పిల్లలు తాము చదివినది పరీక్షల్లో రాసేటప్పటికి మర్చిపోతూ ఉంటారు. ఎంత చదివిన గుర్తుoడటం లేదు అని కొంత మంది పిల్లలు అంటుంటారు. అంటే వారి ఏకాగ్రత లోపo వల్లే ఇలా జరుగుతుంది. మరి kids concentration  పెంచుకోవాలి అనుకుంటే  ముఖ్యంగా చేయాల్సినది సమతుల్య ఆహారం ప్రతి రోజు తీసుకోవడం తప్పనిసరి. అంతే కాకుండా కొన్ని సులువైన మార్గాలను పాటిస్తే ఏకాగ్రతని పెంచుకోవడం సులభం.

  1. బ్రేక్ ఫాస్ట్ లో హోల్ గ్రైన్ ని తప్పక చేర్చండి:

మీ పిల్లలు ఏ విషయం మీద అయినా సరిగా ఫోకస్ చేయకపోవడానికి అతిపెద్ద కారణం శరీరంలో తగినంత చక్కెర లేకపోవడం. అల్పాహారంలో తృణధాన్యాలను తగినంత అందించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

మీరు బ్రౌన్ రైస్ మరియు మిల్లెట్ ని కూడా చేర్చవచ్చు. మీ పిల్లల అల్పాహారంలో తృణధాన్యాలను ఇవ్వడానికి ఒక మంచి మార్గం బ్రౌన్ రైస్ పోహ. ఒకవేళ అందుకు సమయం లేకపోతే మరొక అద్భుతమైన మార్గం వారు తీసుకునే షేక్స్ లో ఉడికించిన ధాన్యoని వేసి బ్లెండ్ చేసి ఇవ్వాలి

అల్పాహారం లో తృణధాన్యాలను తీసుకోవడం వల్ల స్వీట్స్ తినాలనే కోరిక కలగదు మరియు బ్రెయిన్ ఫాగ్ లేకుండా మంచిగా 8 గంటల వరకు మీ పిల్లలు యాక్టివ్ గా ఉండడానికి సహాయపడుతుంది.

  1. ఇంటిలో ఎక్కువ షుగర్ తీసుకోకుండా చూడాలి:

మీరు మీ పిల్లలు బయట ఉన్నప్పుడు వారు ఎంత చక్కెర తీసుకుంటున్నారో గమనిస్తే, వారి షుగర్ క్రావింగ్స్ ని కంట్రోల్ చేయలేరు. కాని ఇంట్లో ఉన్నప్పుడు ఆ పనిని మీరు చెయ్యొచ్చు.

వారు రెగ్యులర్ భోజనంలో తీసుకునే చక్కెర అమౌంట్ ని అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నించాలి. తీవ్రమైన మార్పులను చేయడానికి బదులుగా, నెమ్మదిగా ఈ మార్పులను గమనించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు, మీ పిల్లవాడు ఒక గ్లాసు పాలులో రెండు టేబుల్ స్పూన్ల షుగర్  తీసుకుంటే, అది 1.5 టేబుల్ స్పూన్లు తయారు చేసి క్రమంగా ఒక టేబుల్ స్పూన్ కి తీసుకురావాలి. ఆటోమాటిక్ గా తక్కువ షుగర్ తీసుకోవడానికి అలవాటు పడతారు.

  1. మీ పిల్లలు ఆకలిగా ఉంటే ఈ స్నాక్స్ ఇవ్వండి:

బంగాళాదుంపకు బదులుగా, ఈ పిండిపదార్థాలు ఉన్న స్నాక్స్ ని ప్రయత్నించండి.

  1. స్వీట్ పొటాటో లేదా చిలగడదుంప తో కూడా చిప్స్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ ని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. అవి అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి.
  2. ఎరుపు గుమ్మడికాయని ఉపయోగించి రోటీ రోల్ చేయ్యొచ్చు.

స్టార్చ్ స్నాక్స్ పిల్లలకి ఈ రకంగా సహాయపడతాయి

స్టార్చ్ సెరోటోనిన్ యొక్క ఒక నాచ్యురల్ సోర్స్ , ఇది ఒక గొప్ప మానసిక స్థితిని కొనసాగించడానికి సహాయపడుతుంది. ఇది మీ పిల్లలు ప్రశాంతత మరియు సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఈ ఫుడ్స్ మీ పిల్లల ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకుంటే క్రమంగా మీ kids concentration ని పెంచుకోవచ్చు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)