ఎన్టీఆర్ బయోపిక్ కోసం భారీగా రెమ్యునరేషన్ ను తీసుకుంటున్న ఆ హీరోయిన్

ఇప్పుడు ఇటు టాలీవుడ్ లోను,అటు బాలీవుడ్ లోను బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత కథలను వెండి తెరపై చూపించి బాగానే కాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికే హిందీలో వచ్చిన మేరికోం, సంజు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొట్టారు. అలాగే తెలుగులో మహానటి సావిత్రి గారి జీవతాన్ని కళ్ళకు కట్టినట్టుమహానటి సినిమాలో చూపించారు. ఈ మూవీకి ప్రజలు నీరాజనాలు పలికారు.

ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను వెండితెరపై చూపించే బరువు భాధ్యతలను తన భుజాలపై వీసుకొని ఎక్కడ కాoప్రమైస్ కాకుండా ఈ బయోపిక్ కోసం పని చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోవాలని బాలయ్య భావన. ఎన్టీఆర్ జీవితంలో రాజకీయాలు కీలకపాత్ర పోషించాయి, వీటన్నింటిని వెండితెరపై అద్భుతంగా చూపించడానికి దర్శకుడు క్రిష్ కూడా అంతే కష్టపడుతున్నాడు. మొదట ఈ బయోపిక్ కోసం తేజని దర్శకుడిగా అనుకున్నప్పటికి అనుకోని కారణాల వల్ల తేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

మహానటుడు ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య దాదాపు 64 గెటప్ లలో కనిపిస్తాడట. జనవరికి ఈ బయోపిక్ ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో మరొక గొప్ప పాత్ర ఎన్టీఆర్ మొదటి భార్య బాలకృష్ణ తల్లి బసవతారకంగారు. ఈ పాత్ర కోసం బాలకృష్ణ చాలా ఆలోచించి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిన విద్యాబాలన్ ని ఒప్పించినట్టు తెలుస్తుంది. మొదట రూమర్‌గా మొదలైన ఈ మాట తర్వాత నిజం అయ్యింది. టైటిల్ రోల్‌ను బాలయ్య చేస్తున్న ఈ సినిమాలో విద్య ప్రధాన ఆకర్షణగా మారుతోంది. ఈ సినిమాలో విద్య నటించడం వల్ల దీనికి బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

ఇందులో నటిస్తున్నందుకు గానూ విద్యాబాలన్‌కు కూడా మంచి స్థాయిలో పారితోషికం దక్కుతోందని సమాచారం. ఎన్టీఆర్ లో నటిస్తున్నందుకు గానూ విద్య ఏకంగా కోటిన్నర రూపాయల పారితోషికాన్ని పొందుతోందని ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్‌లో విద్యాబాలన్ లాంటి స్టార్ హీరోయిన్ అందునా జాతీయఅవార్డు పొందిన నటి మహానటుడి సతీమణి పాత్రలో నటించేoదుకు విద్యాబాలన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది కాబట్టి ఆమె డిమాండ్ చేసినంత భారీ రెమ్యునరేషన్ కి బాలకృష్ణ ఓకే అన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే విద్యాబాలన్ షూటింగ్ లో పాల్గొన్నారు.

ఈ బయోపిక్ లో చాలా మంది హీరో, హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ని బాలకృష్ణ ఎంతో శ్రద్ధ పెట్టి సెలెక్ట్ చేసుకున్నారు అని తెలుస్తుంది. రానా, ప్రకాష్ రాజ్, నాగచైతన్య,  సత్య నారాయణ వీళ్లంతా ఖరారు కాగా కీర్తి సురేష్, తమన్నా పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మరి బాలకృష్ణ తన ప్రాణం పెట్టి తీస్తున్న తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ వెండితెరపై ఎలా ఉండబోతుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

 

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)