ఇంటర్వ్యూ: మేఘాంశ్

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 12న గ్రాండ్ గా విడుదల అవుతున్న సందర్భంగా హీరో మేఘాంశ్ ఇంటర్వ్యూ…

సినిమాల్లోకి రావాలని ఎప్పుడు అనుకున్నారు ?
చిన్నప్పటి నుండి నటుడవ్వాలనే కోరిక ఉంది. నాన్న గారికి చెప్పాను. రైట్ టైం లో నన్ను లాంచ్ చేస్తా అన్నారు. కానీ నా లాంచింగ్ సమయంలో ఆయన లేకపోవడం బాధాకరం.

మమ్మి సపోర్ట్ ఎలా ఉంది ?
నాన్న తరువాత మమ్మి నన్ను అన్నీ తానై చూసుకుంది. సెట్స్ లో బాగా సపోర్ట్ చేసింది. మమ్మి దగ్గర డాన్సింగ్ లో మెలకువలు నేర్చుకున్నాను.

నిర్మాత , డైరెక్టర్ గురించి ?
చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్స్ అర్జున్, కార్తిక్ ఒకరినొకరు అర్థం చేసుకొని క్రేయేటివ్ గా సినిమాను తెరకెక్కించారు. భవిషత్తులో వారు మంచి దర్శకులు అవుతారు.

రాజ్ దూత్ ఎలా ఉండబోతోంది ?
అందరికి నచ్చే సినిమా అవుతుంది. ఫ్యామిలీ, మదర్ సెంటిమెంట్ సినిమాలో బాగా పండాయి. మమ్మి సినిమా చూసి మెచ్చుకుంది. ఆడియన్స్ కు కూడా ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నా.

ఇండస్ట్రీ నుండి సపోర్ట్ ఎలా ఉంది?
ఇండస్ట్రీలో అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికి థాంక్స్. ప్రీ రిలీస్ ఈవెంట్ కు నాన్నతో వర్క్ చేసిన డైరెక్టర్స్ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు.

మీ నెక్ట్ ప్రాజెక్ట్స్ ?
చర్చల దశలో ఉన్నాయి. రాజ్ దూత్ విడుదల తరువాత వాటి డీటెయిల్స్ చెబుతాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)