Tollywood news in telugu

కొత్త పోస్టర్ తో ఆకట్టుకుంటున్న హీరో హీరోయిన్ !!!

నవీన్ చంద్ర, గాయత్రి సురేశ్‌, పూజా జవేరీ, నవీన్ చంద్ర హీరో హీరోయిన్స్‌గా జీఎస్‌ కార్తిక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్‌ టీజర్ ఇటీవల విడుదలైన మంచి రెస్పాన్స్ పొందింది. ‘హీరో హీరోయిన్’ టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా పైరసీ అండ్ సినిమా నేపథ్యంలో రూపొందించినట్టు టీజర్‌ను బట్టి తెలిసింది.

దీపావళి సందర్భంగా ఈ చిత్ర కొత్త పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. పోస్టర్ లో నవీన్ చంద్ర లుక్ బాగుంది. అలాగే తన మొహం మీద రాసిన కొన్ని పదాలు చూస్తే తెలుస్తుంది హీరో ఈ సినిమాలో పైరసీ చేసే యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడని. సినిమా పైరసీ మీద వచ్చే మొదటి సినిమాగా హీరో హీరోయిన్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుత సమాజంలోని అంశాలు తీసుకొని దర్శకుడు కార్తీక్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఆడియన్స్ కు కావల్సిన అన్నీ ఎలిమెంట్స్ తో పాటు ఒక చక్కని సందేశం ఈ సినిమాలో ఉండబోతోందని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ జరువుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button