హ్యాపీ వెడ్డింగ్ మూవీ రివ్యూ

నటీనటులు : సుమంత్ అశ్విన్, నిహారిక, నరేష్, మురళీ శర్మ

సంగీతం : శక్తికాంత్ కార్తీక్

సినిమాటోగ్రఫర్ : బాల‌రెడ్డి

దర్శకత్వం : లక్ష్మణ్ కార్య

నిర్మాతలు : ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఒక మనసు అనే మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. రెండేళ్ళ తర్వాత వచ్చిన తన రెండవ సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’. సుమంత్ అశ్విన్ హీరో. ఈ మూవీ శనివారం రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ట్రైలర్స్ ని బట్టి చూస్తే ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంచనా వెయ్యొచ్చు. టైటిల్ ద్వారా ఇది ఒక మ్యారేజ్ రిలేటెడ్ స్టోరీ అని గెస్ చేయొచ్చు. మరి హ్యాపీ వెడ్డింగ్ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు రీచ్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే. మరి అసలు ఈ మూవీ కథా విశేషాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

కథ :
స్టోరీ లోకి ఎంటర్ అయితే అక్షర (నిహారిక) ఆనంద్‌ (సుమంత్ అశ్విన్‌) లవ్ చేసుకుంటారు. వీరి ప్రేమ పెళ్ళికి దారి తీస్తుంది. ఎలాంటి గొడవలు లేకుండా ఫ్యామిలీ మెంబెర్స్ అందరి సమక్షంలో ఘనంగా ఎంగేజ్ మెంట్ కూడా జరుగుతుంది. అంతా హ్యాపినే కదా అనుకుంటున్నారా అక్కడే ఉంది ఒక ట్విస్ట్. అక్షరకి ఇదివరకే (వరుణ్) విజయ్ అనే అబ్బాయితో బ్రేకప్ అయ్యి ఉంటుంది.

ఫ్యామిలీ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న టైంలో అక్షర, ఆనంద్ ల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అక్షర ఆనంద్ ని పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూషన్ లో ఉంటుంది. అదే టైంలో విజయ్ ఎంటర్ అవుతాడు. దీనితో అక్షర మరింత కన్ఫ్యూషన్ కి లోనవుతుంది. మరి చివరకు అక్షర, విజయ్ తనకు కరెక్ట్ అనుకుంటుందా? లేదంటే  ఆనంద్ ను అర్థం చేసుకుంటుందా? వారి పెళ్లి జరుగుతుందా ? అని తెలుసుకోవాలంటే “హ్యాపీ వెడ్డింగ్” సినిమా  చూడాలసిందే.

విశ్లేషణ :

దర్శకుడు లక్ష్మణ్ కార్య ఒక సగటు అమ్మాయికి పెళ్లి గురించి ఉండే అనుమానాలను, ఎమోషనల్ ఫీలింగ్స్ ని చాలా బాగా చూపిoచారు. పెళ్లి నేపధ్యంలో వచ్చిన మూవీ కావడం వల్ల ఫ్యామిలీ మరియు క్లాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది.  మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకున్నప్పటికి చెప్పాల్సిన విషయాన్ని సాగదీసినట్టుగా అనిపిస్తుంది. మూవీ అంతా హీరోయిన్ కన్ఫ్యూషన్ తోనే ఉంటుంది. అక్షర, ఆనంద్ ల మధ్య గొడవ వల్ల అక్షర ఆనంద్ తనకు కరెక్ట్ అవునా కాదా అనుకోవడం కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. రొమాంటిక్ సన్నివేశాలు చాలా తక్కువ, ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి ఇంట్లో ఉండే ఆ సందడి, హడావిడిని బాగా చూపించారు. ఒక మంచి ఫ్యామిలీ రిలేషన్స్ ని చూపించారు.

 

 

నటన పరంగా:

మెయిన్ గా అక్షర క్యారెక్టర్ లో నటించిన మెగా వారసురాలు నిహారిక ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందనే చెప్పాలి. మొదటి సినిమాతో పోలిస్తే తన యాక్టింగ్ లో పరిణితి కనిపిస్తుంది. వరుణ్ తిరిగి తన ప్రేమను పొందడానికి ప్రయత్నించే క్యారెక్టర్ లో బాగా నటించాడు. ఇక హీరో సుమంత్ అశ్విన్ తన పాత్రకు 100% న్యాయం చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే మురళీశర్మ గారు హీరోయిన్ తండ్రి పాత్రలో మంచి నటన కనబరిచారు. నరేష్ గారు,అన్నపూర్ణ గారు తమ పరిధిలో నవ్వులు బాగానే పూయించారు. సైకాలజిస్ట్ గా ఇంద్రజ పాత్ర బాగుంది. తను తక్కువసేపు మాత్రమే సినిమాలో కనిపిస్తుంది.

 సాంకేతిక విభాగం :

దర్శకుడు లక్ష్మణ్ కార్య మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకున్నారు. తమన్ యస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. శక్తికాంత్ కార్తీక్ సమకూర్చున పాటలు కూడా బాగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పెళ్లికి సంభందించిన సన్నివే శాలను, విజువల్స్ ను చాలా అందంగా చిత్రీకరించారు. నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

మంచి స్టోరీ లైన్

సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్

తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

ఎమోషనల్ సీన్స్

 మైనస్ పాయింట్స్ :

లవ్ ట్రాక్ పెద్దగా లేకపోవడం

సాగదీసిన కథనం

తీర్పు :

సినిమాలో మెయిన్ గా చెప్పాలనుకున్న ఓ సగటు అమ్మాయికి పెళ్లి పట్ల ఉండే అనుమానాలను భయాలు గురించి చూపించడం బాగుంది. మొత్తం మీద ఈ చిత్రం అమ్మాయిలను, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఫీల్ గుడ్ మూవీ.

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)