మెగాస్టార్ మెగా బర్త్ డే గిఫ్ట్ :“సైరా” టీజర్

టాలీవుడ్ లో స్వయంకృషితో పైకి వచ్చిన గొప్ప వ్యక్తీ చిరంజీవి గారు. సినీ అభిమానులకు, వర్ధమాన హీరోలకు ఆయన ఒక రోల్ మోడల్. తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక మెగాస్టార్. చిరంజీవిగారు ఈ రోజు తన 63వ పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. మెగాస్టార్  చిరంజీవి 151 వ చిత్రం “సైరా నరసింహారెడ్డి”. తెలుగులో ‘బాహుబలి’ తర్వాత అంత భారీగా,ప్రతిష్టాత్మకoగా చిత్రీకరిస్తున్న మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఈ సినిమా టీజర్ ని ఆగస్టు 22న అంటే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా అభిమానుల కోసం ఒక రోజు ముందే అంటే నిన్న మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు చిత్ర యూనిట్ ‘సైరా’ టీజర్ ని రిలీజ్ చేసారు. చిరంజీవి తల్లిగారు అంజనా మూర్తి చేతులు మీదుగా ఈ టీజర్‌ను విడుదల చేశారు.

ఇండియా అన్‌సంగ్ హీరో 1800 ప్రాంతంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి భారతీయ పోరాట యోధుడు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. నరసింహారెడ్డి గెటప్ లో మెగాస్టార్ అద్భుతంగా కనిపించారు. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి లాంటి ప్రముఖ నటులు అంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ తీర్చి దిద్దారు. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పై హీరో రాంచరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2019లో వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిరంజీవి బర్త్ డే కానుకగా వచ్చిన ఈ టీజర్ సినిమా విడుదలకి ముందే ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిన్న విడుదల అయిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ టీజర్ లో చిరంజీవి జెండా పట్టుకొని కోట మీద నిలబడి ఉన్న సీన్స్, గుర్రంపై స్వారీ చేసుకుంటూ బ్రిటీష్ సైనికులపై కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు కన్నుల పండుగగా ఉన్నాయి. ఈ యుద్ధం ఎవరిదీ అనే డైలాగ్, విజువల్ ఎఫెక్ట్స్ తో టీజర్ సూపర్‌గా ఉంది.
చివరి షాట్ లో గుర్రం పై చిరు కత్తి దూస్తుంటే 60 ఏళ్ళ వయసులో కూడా మనకు ఆనాటి గ్యాంగ్ లీడర్ కనిపిస్తున్నాడు. ప్రధానంగా టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ టీజర్ కే హైలెట్. టీజర్ ఇంత అద్భుతంగా ఉంటేమరి సినిమా ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి టీజర్ తో తన అభిమానులకు ఇంత అందమైన బర్త్ డే గిఫ్ట్ ని ఇచ్చిన మన మెగాస్టార్ చిరంజీవికి మనము బర్త్ డే విషెస్ చెబుతాం. హ్యాపీ బర్త్ డే చిరు.

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)