హల్ చల్ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు రిలీజ్ చేసారు

శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న చిత్రం హల్ చల్. రుద్రాక్ష, ధన్య బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబదించిన ట్రైలర్ ను ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు రిలీజ్ చేసారు.
  ఈ సందర్బంగా సందీప్ రెడ్డి గారు మాట్లాడుతూ ట్రైలర్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండ సినిమా చూస్తారు. ట్రైలర్ తనకు కూడా చాలా నచ్చింది అని ఇలాంటి వినూత్నమైన కథతో వస్తున్న దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్ ఆర్టిస్టులకు, టెక్నిషియన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు.
 సినిమా పెద్ద హిట్టు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. నిర్మాత గణేష్ కొల్లూరి మాట్లాడుతూ మూడు సంవత్సరాలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 14న ప్రేక్షకులముందు తీసుకువస్తున్నాము. ఈ సినిమా msk  డిజిటల్ ద్వారా శ్రీ మల్కాపురం శివకుమార్ గారు రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించిన నటీ నటుల సాంకేతిక నిపుణుల సమిష్టి కృషితో అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించి మా సినిమాను విజయంతం చేస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు.
హీరో రుద్రాక్ష్  మాట్లాడుతూ హీరోగా తొలి పరిచయం అవుతున్న నాకు మంచి కథతో కూడిన సినిమా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను, నాకు హీరోగా అవకాశం కల్పించిన నిర్మాత గణేష్ కొల్లూరి గారికి మరియు మా అభ్యర్థన మన్నించి మా సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన నా మిత్రుడైన డైరెక్టర్ సందీప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.
దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ ఒక కొత్త కథతో వచ్చిన నాకు నిర్మాత గణేష్ గారు డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాను ఇది ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నారు అన్నారు.
 
 
Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)