ఫీట్ అప్ విత్ ద స్టార్ ” మీ ఫేవరేట్ స్టార్స్ ని మరింత దగ్గర చేస్తుంది…. మంచు లక్ష్మి..

డిజిటల్  మీడియా రివల్యూషన్  చాలా వినోదలను అందుబాటులో కి తెస్తుంది.  ఎంటర్ టైన్మెంట్ పరిధులు పెంచుతూ, సరికొత్త వినోదలను పరిచయం చేస్తుంది.  అలాంటి వూట్ అప్  ప్రెజెంట్స్ ‘ఫీట్ అప్ విత్ ద స్టార్’ మంచు లక్ష్మీ హోస్ట్ గా రాబోతున్న ఈ ఎంటర్ టైన్మెంట్ షో అనుభవాలు మీడియా తో పంచుకుంది.
ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ
” ఇప్పటి వరకూ నేను చేసిన షోస్ లో ఈ ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’ భిన్నమైనది. ఈ షో కోసం స్టార్స్ ని కలిసి నప్పుడు నైట్ డ్రెస్ లో రమ్మంటే వారి లో కొందరు ఆశ్చర్య పోయారు. కొందరు ఉత్సాహం చూపించారు. బాలీవుడ్ లో ఈ తరహా షోలు సాధారణ మే. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. వాళ్ళ పర్సనల్ విషయాలు ఈ షో తో తెలుస్తాయి. ఇందులో కాంట్రవర్సీ లకు తావులేదు. స్టార్స్ నా మీద పెట్టుకున్న భరోసా ను చెదరనివ్వలేదు. ఈ షో కి వచ్చే స్టార్స్ చాలా ఇంటర్వ్యూలు చేశారు. టాక్ షోలు, ఈవెంట్స్ లో మాట్లాడారు. వాళ్ల విషయాలు చాలా తెలుసు అనుకుంటాం. కానీ వారి లో ప్రతి రోజు ఎదో చేంజ్ వస్తుంది. వారి మాటలు, అనుభవాల్లో నుంచీ వస్తాయి.  ఉదాహరణకు : సమంతా మనకు చాలా తెలుసు అనుకుంటాం.. కానీ నాగ చైతన్య గురించి ఈ షో లో మాట్లాడిన విషయాలు మీ కు సర్ప్రైజ్ గా ఉంటాయి. వరుణ్  తేజ్  ఈ షో లో కొత్త గా కనబడతాడు. చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్. వచ్చిన వాళ్ళందరూ ఈ షో ని బాగా ఎంజాయ్ చేసాను. వాళ్ళ అభిమానులకు మరింత దగ్గర అవుతారు. ఈ షో కంప్లీట్ ఎంటర్ టైన్మెంట్ వే లో వెళుతుంది. ఈ షో తప్పకుండా బిగ్ సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను.
ఈ ఎపిసోడ్స్ ఈ నెల23 నుండి వూట్ ఆప్ లో అందుబాటులో ఉంటాయి. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ అందుబాటులోకి వస్తుంది” అన్నారు.
Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)