COPY CODE SNIPPET

“లకలక లకుమీకర లంభోధరా” …వినాయకచవితి శుభాకాంక్షలతో

ముందుగా అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, న్యాచురల్ స్టార్ నానిలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘devadas’. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మల్టిస్టారర్ సినిమాకు  శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.  సీనియర్ నిర్మాత చలసాని అశ్విని దత్ ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్, నాని పక్కన ఛలో ఫేం రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ ఓ డాన్ పాత్ర పోషిస్తుండగా నాని ఒక డాక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ devadas షూటింగ్ కూడా నిన్నటితో పూర్తయింది. నాగార్జున, నాని ఈ విషయాన్ని ట్విట్టర్ లో అఫీషియల్ గా ఎనౌన్స్ కూడా చేశారు. సెట్ లో చిత్ర యూనిట్ తో కలిసి దిగిన ఒక గ్రూప్ ఫొటో కూడా షేర్ చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్, టీజర్, ఆ తరువాత సాంగ్స్ ని సింగిల్స్ రూపంలో లిరికల్ వీడియోలతో ఒక్కక్కోటిగా విడుదల చేస్తున్నారు. దేవదాస్ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు సింగిల్స్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఇది మూడో సింగిల్.

తెలుగువారు కన్నులపండుగగా జరుపుకునే వినాయక చవితి సందర్భంగా ఒకరోజు ముందే బొజ్జ గణపయ్యను హైలైట్ చేస్తూ మా పండుగ కొంచెం ముందే మొదలయ్యింది అంటూ ఒక స్పెషల్ లిరికల్ వీడియో సాంగ్ ని నిన్ననే విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి గారు రాసారు. “లకలక లకుమీకర లంబోదర” అంటూ ఈ పాట సాగుతుంది. సింగర్స్ అనురాగ్ కులకర్ణి, శ్రీ క్రిష్ణ ఈ ప్రత్యేక పాటను పాడారు. ఈ పాటలో “devadas” లు ఇద్దరు ‘‘రాజాధి రాజా గణరాజ.. విగ్నేశ్వరాయ జయహో..’’ అంటూ మొదలైన ఈ పాట ‘గణపతి పప్పా మోరియా’ ‘లకలక

ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో గణపయ్య గురించి అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇప్పుడు ఈ సాంగ్ కూడా ఈ లిస్టులో చేరనుంది. ఇప్పటికే విడుదలైన దేవదాస్ చిత్రంలోని రెండు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడో సాంగ్ కూడా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ పాట వినాయక నవరాత్రులలో మారుమోగడo, మనల్ని హుషారెత్తించడం ఖాయం. గెట్ రెడీ. “గణపతి బప్పా మోరియా”

 

 

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Enjoy this blog? Please spread the word :)

Inline
Inline