మందులో మునిగితేలుతున్న “దేవదాసు”లు

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, న్యాచురల్ స్టార్ నానిలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘దేవదాస్’. ఇది ఒక  కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మణి శర్మ సంగీతం అందిస్తున్న ఈ మల్టిస్టారర్ సినిమాకు  శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.  సీనియర్ నిర్మాత చలసాని అశ్విని దత్ ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.  నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్, నాని పక్కన ఛలో ఫేం రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ ఓ డాన్ పాత్ర పోషిస్తుండగా నాని ఒక డాక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.

ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ తో ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతున్నారు. ఆ క్రమంలోనే ఈమధ్యనే ఒక మందు బాటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఆ మూత ఆగష్టు 7 న ఓపెన్ అవుతుందంటూ హింట్ ఇచ్చారు. అనుకున్నట్టే నిన్న సాయంత్రం ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు నాగార్జున. ఈ ఫస్ట్ లుక్ లో పోస్టర్ లో ఉన్న మందు బాటిల్ ఓపెన్ చేసి ఫుల్ గా పట్టించి ఒకే బెడ్ పై నిద్ర పోతున్న నాగార్జున, నాని లని చూపించారు. నాగార్జున ఎడమ చేతిలో మందు బాటిల్ పట్టుకొని ఉంటే కుడి చేతిలో రివాల్వర్ పట్టుకొని ఉన్నాడు.  ఒక షూ కాలికి ఉంది, రెండో షూ కాలి కింద ఉంది.  పక్కనే పడుకొని  ఉన్న డాక్టర్ నాని ఇన్-షర్ట్ కాస్త చెదరిపోయింది. నోరు కాస్త తెరిచి ఒళ్ళు తెలీకుండా మత్తుగా నిద్రలో ఉన్నారు. మెడకి స్టెతస్కోప్ అలానే ఉంది. వీళ్లిద్దరూ లేచేది మాత్రం సెప్టెంబరు 27నే అని ప్రకటించింది చిత్రబృందం. లేస్తే మాత్రం అల్లరి మామూలుగా ఉండదని కూడా ప్రకటించింది.
ఈ చిత్రంలో నాగార్జున దేవ్‌గా, దాస్‌గా నాని కనిపించనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ సందర్భంగా ఇద్దరూ ట్విట్టర్ లో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. నాగార్జున… నాని ట్విట్టర్ లో  యాక్టివ్ గా ఉంటారు. “నా పక్కన పారు ఉంటుందనుకుంటే – దాస్ ఫెలో ఉన్నాడు” అంటూ నాగ్ కామెంట్ చేశాడు. నాని మాత్రo 1996లో నాగార్జున సార్ నటించిన “నిన్నే పెళ్లా డతా”. నాగ్ సార్  స్క్రీన్ పైన, నేనేమో దేవి థియేటర్ బయట క్యూలోన. 2018లో దేవదాస్. నాగార్జున – నేను కలిసి ఫస్ట్ లుక్ లో” అంటూ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకొన్నాడు.

మరి ఫస్ట్ లుక్ ఇంత కిక్ ఇస్తే, మూవీ రిలీజ్ అయ్యి ఈ దేవదాసులు లేస్తే ఇంకెలా ఉంటుందో చూడాలంటే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.

 

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)