health tips in telugu

బ్లడ్ షుగర్ ను నియంత్రించే 3 కూరగాయలు ఇవే

Three Veggies for diabetics
Three Veggies for diabetics

డయాబెటిస్ అన్న పదానికి ఇప్పుడు పరిచయం అక్కర్లేదు మన దేశంలో. ప్రపంచలోకెల్లా డయాబెటిస్లో మన దేశం మొదటి మూడు స్థానాల్లోనే కొనసాగుతోంది. అయితే ఈ వ్యాధి ఒకసారి సోకిందంటే ఇక జీవిత కాలం పోదు. ఎప్పుడూ మందులు వేసుకుంటూ నియంత్రించుకుంటూ ఉండాలి. సరే, ఈ డయాబెటిస్ లో type 1, type 2 అని రెండు రకాలు ఉన్నాయి. మొదటిది చాలా చిన్న వయసులో వస్తుంది. దానికి కారణం గర్భంలో ఉండగానే ఆరోగ్యం దెబ్బ తినడం లేదా బలమైన ఫ్యామిలీ హిస్టరీ దీనికి కారణం. ఇక type 2 డయాబెటిస్ ను life style డిసీస్ అంటున్నారు వైద్యులు. అంటే అతిగా చిరు తిళ్ళు తినడం, శీతల పానీయాలు, వ్యాయామం లేకపోవడం ఇంకా చాలా కారణాలు ఉన్నాయి.

సరే, మరి ఈ డయాబెటిస్ సోకిన వారికి వైద్యులు ఇది తినవద్దు, అది తినవద్దు అని బోలెడంత చిట్టా చదువుతారు. మరి తినాల్సినవి ఏమిటి? అనే సందేహం వస్తే దానికి ఇదే మా సమాధానం. డయాబెటిస్ వ్యాధి ఉన్న వారికి ఈ కింద చెప్పబడిన మూడు కూరగాయలు అమోఘంగా పని చేసి వారి రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. అవి

  1. కాకరకాయ: కాకరకయ anti-oxidant లు పుష్కళoగా ఉన్నాయి. అంతే కాదు దీనిలో ఇన్సులిన్ ను పోలిన పదార్ధం రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. అందుకే కాకరకాయ జ్యూస్ కూడా పరగడుపునే డయాబెటిస్ ఉన్న వారు తాగితే మంచిది.
  2. కాలీఫ్లవర్: ఈ కాలీఫ్లవర్ లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఎక్కువ పీచు పదార్ధం ఉండడం చేత డయాబెటిస్ వారికి మేలు చేస్తుంది.
  3. బ్రోకలీ: పోషకాలన్నీ పోత పోస్తే బ్రోకలి అవుతుంది. దీనిలో అత్యధిక శాతం పీచు పదార్ధం ఉండడం చేత ఇది తిన్నా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది. ఆ పైన దీనిలో ఉండే sulforaphanes కాన్సర్ నుండి కూడా రక్షణ ఇస్తుంది.

ఈ మూడు రకాల కూరగాయలు కూడా low glycemic index కావడం గమనించగలరు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button