ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు

నిన్నటి తరం వరకు కూడా మనుషులకు ఎక్కువగా అనారోగ్యాల బారిన పడేవారు కారు. కానీ నేడు, మారిన జీవన శైలి, ఉద్యోగ జీవితం, ఆహారపుటలవాట్లలో మార్పు ఇవన్నీ మనుషుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు 90 దాటి బ్రతికే వారంటే ఆశ్చర్యం కలిగేది కాదు. కానీ నేడు 70 దాటితే గొప్ప అని చెప్పుకోవాల్సి వస్తోంది. అన్నిటికి మించి అప్పటి దాకా ఆరోగ్యంగా ఉంటే అదృష్టమే.

ఎందుకంటే ఈ రోజు 30 లలో డయాబెటిస్, గుండె పోటు, బలహీనత, 40లలో కాన్సర్, 50లలో పూర్తిగా ఎముకలు అరిగిపోవడం వంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక్క రోజే వచ్చి మీద పడ్డవి కావు. విత్తనంల మొదలై వృక్షంలా మారాక బయట పడుతున్నాయి. అందువల్ల తొలి దశలోనే వీటిని గుర్తించగలిగితే మంచిది.

30 లు దాటిన ప్రతీ వారు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.

Bone density: ఒకప్పటి తరానికి ఉక్కు ఎముకలు ఉండేవేమో కానీ ప్రస్తుత తరంలో నూటికి తొంభై శాతం మందికి ఎముకలు బలహీనంగానే ఉన్నాయి. పౌష్టికాహార లోపం, సూర్య రశ్మి సోకకపోవడం, పాలు, నెయ్యి వంటి వాటిలో కల్తీ ఇలా ఎముకలు బలహీన పడటానికి కారణం. ప్రతీ ఒక్కరు ఏడాదికి ఒక మారు ఈ bone density పరీక్ష చేయించుకుని దానికి తగ్గ ఆహారం, తీసుకుంటే 50 ల నాటికి సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.

Cholestrol: శరీరంలో కొవ్వు పేరుకు పోవడం, బీపి కూడా చిన్న వయసులో గుండె పోటుకి కారణం అవుతున్నాయి. ఇందుకోసం ముందుగా BMI (Body mass index) చూసుకుని అందులో సూచన ప్రకారం ఎప్పటికప్పుడు cholestrol, బీపి అందరూ చేయించుకోవాల్సిందే.

Cancer: ఈ పేరుకు జడవని వారు ఉండరు. ఎవరికి, ఎప్పుడు, ఎందుకు వస్తుందో చెప్పలేము. అలాంటి ఈ కాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయి బ్రెస్ట్ కాన్సర్, సెర్వికల్ కాన్సర్ లన్గ్, prostrate కాన్సర్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. 35 దాటిన ప్రతీ స్త్రీ విధిగా breast మరియు సెర్వికల్ కాన్సర్ testలు చేయించుకోవాల్సిందే. అలాగే పురుషులు కూడా వారికి రావడానికి ఆస్కారం ఉన్న కాన్సర్ test లు చేయించుకోవలసిందే.

పైన చెప్పిన పరీక్షలు ప్రతీ ఒక్కరు ఏడాదికి ఒక మారు చేయించుకుంటే ఒక వేళ శరీరంలో ఏమైనా రోగం బీజ దశలో ఉంటే, అలా ఉండగానే నాశనం చేయవచ్చు. అధునాతన వైద్యం అందుకు సహకరిస్తుంది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)