Chiru koratala new film news

కొరటాల శివ అంటే ఒక సందేశాత్మక చిత్రాలు తెలుగు చిత్రసీమ కి అందించిన వర్ధమాన దర్శకుడు. గతంలో ఆయన తీసిన మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అను నేను చిత్రాలు కమర్షియల్ గా మాత్రమే కాదు సందేశాత్మకం గా కూడా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. తనదైన శైలి లో ఏక కాలం లో ప్రేక్షకులకు వినోదం తో పాటు , సందేశాన్ని కూడా ఇస్తున్న ఈ దర్శకుడు మన మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సంచలన చిత్రం దిశగా అడుగులు వేస్తున్నారుట.
ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి గారితో ఇదివరకే కథ గురించి చర్చించినట్టు , ఆయన హీరోయిజం కి తగినట్టు , కొరటాల ఫార్ములా కి తగ్గకుండా అద్భుతం అయిన సందేశాత్మక చిత్ర రూపకల్పన జరుగుతుంది. ఈ సినిమా జనవరి నుండి నిరవధిక షూటింగ్ జరిగే అవకాశం ఉందిట. బాస్ మళ్ళీ టాగూర్ స్టాలిన్ లాంటి విజయం అందుకోవాలని కోరుకుందాం

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)