movie reviews

C/O కంచరపాలెం మూవీ రివ్యూ

 నటీనటులు : సుబ్బారావ్, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు, కార్తిక్ ర‌త్నం, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్

దర్శకత్వం : వెంకటేశ్ మ‌హా

స‌మ‌ర్ప‌ణ‌ : ద‌గ్గుపాటి రానా

నిర్మాత : విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి

సంగీతం : స‌్వీక‌ర్ అగ‌స్తి

సినిమాటోగ్రఫర్ : ఆదిత్య జ‌వ్వాడి అండ్ వ‌రుణ్ ఛాపేక‌ర్

ఎడిటర్ : రవితేజ గిరిజిల

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై ‘రానా దగ్గుబాటి’ సమర్పిoచిన చిత్రం C/o కంచెరపాలెం. ఎలాంటి కమర్షియల్ విలువలు, హంగులు, ఆర్భాటాలు లేకుండా  రిలీజ్‌కు ముందే ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కటి అనుభూతి నింపే సినిమా అనే టాక్‌ను సంపాదించుకొన్నది. నూతన దర్శకుడు మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు. సుబ్బరావు, రాధా బెస్సె, కెసవ కె, నిత్య శ్రీ తదితరులు నటించగా పరుచూరి విజయ ప్రవీణా నిర్మించారు. ఈ సినిమాలో నటించిన 52 మంది కొత్తవాళ్లే. అంతేకాదు వాళ్లందరూ ‘కంచెర‌పాలెం’ ప్రాంతవాసులే కావడం C/O kancherapalem మూవీ ప్రత్యేకత. కాగా ఈ చిత్రం ఇప్పటికే ప్రముఖులు, సినీ విమర్శకుల ప్రసంశలు పొందింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే ఇప్పుడు C/o kancherapalem కథలోకి వెళ్లి చూద్దాం.

కథ :

c/o kancherapalem  అనే ఊరిలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్ రాజు (సుబ్బారావు) 50 ఏళ్లు దగ్గరపడినా బ్రహ్మాచారిగానే ఉంటాడు. అదే ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ పై  అధికారిగా రాధ (రాధ జెస్సీ) వస్తుంది. అప్పటికే రాధకి భర్త చనిపోయి 20 ఏళ్ల కూతురు కూడా ఉంటుంది. రాజు, రాధ ఆ వయసులో ఒకరినొకరు ఇష్టపడతారు. అలా వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొంటారు. అదే ఊరిలో ఉండే ఐదు సంవత్సరాల పిల్లలు సునీత , సుందరం మధ్య ప్రేమ కథతో పాటుగా జోసెఫ్, భార్గవి, అలాగే గడ్డం , సలీమా ప్రేమ కథల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ప్రతి ప్రేమ కధకి ముఖ్యంగా ఎప్పుడు ఉండే సమస్యలైన మతం, కులం, వయస్సు, ఆస్తి, అంతస్తు ఇలా అన్నీ కూడా ఈ ప్రేమ కథలకు అడ్డుగోడగా నిలుస్తాయి. మరి ఆ అడ్డుగోడల నుండి తప్పించుకొని తమ ప్రేమను గెలిపించుకున్నారా ? అసలు ఈ ప్రేమ కథలన్నిటికి ఉన్న సంబధం ఏమిటి ? ఈ కథల్లోని పాత్రలన్ని ఒకే కథలో ఏ విధంగా కలుస్తాయి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు పొందడానికి , మొత్తం క్రెడిట్ అంతా కూడా కొత్త దర్శకుడు వెంకటేష్ మహాకే దక్కుతుంది. అసలు సినిమా యాక్టింగ్ తెలీదు, స్టార్ హీరో హీరోయిన్స్ లేరు, పవర్ క్యాస్టింగ్ , కమర్షియల్ హంగులు, ఐటమ్ సాంగ్స్, భారీ సెట్టింగ్స్ కాని ఏవి ఈ సినిమాలో కనిపించవు. దర్శకుడిగా తన స్టామినా ఏంటో తొలి చిత్రం తోనే  తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయోగాత్మక చిత్రం చేశారు. సినిమా చూస్తున్నంత సేపు కంచెరపాలెం అనే ఊరిలోకి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు నటిస్తున్నారా, లేక కంచరపాలెం ఊరిని లైవ్‌లో చూపిస్తున్నారా? అన్నంతగా పాత్రల్లో ఒదిగిపోయారు. సున్నితమైన ప్రేమ కథలు ఈ సినిమాకు ప్రధాన బలం మరియు రియలిస్టిక్ జీవితాలను ప్రతిబింబిస్తాయి. దాంతో పాటు కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతి పాత్ర అర్ధవంతగా సాగుతూ కథను అంతర్లీనంగా ముందుకు నడుపుతుంది. సినిమా మొత్తం డబ్బింగ్ లేకుండా, లైవ్ రికార్డింగ్‌తో కొత్త ప్రయోగం చేశారు దర్శకుడు. అందుకే ఆ సంభాషణలు కొత్తగా అనిపిస్తాయి. మహా రాసుకున్న స్క్రీన్ ప్లేలో ప్రతి పాత్రను కథలోకి తీసుకొచ్చిన విధానం మెచ్చుకోదగినది. సినిమా చివరకి వచ్చేసరికి పాత్రలకు ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు బాగా మెయిటైన్ చేశాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా మీద మంచి భావేద్వేగంతో కూడుకున్న అనుభూతి కలుగుతుంది.

నటీనటులు:

జోసెఫ్ (కార్తీక్ రత్నం), భార్గవి (ప్రణీతా పట్నాయక్)- గెడ్డం (మోహన్ భగత్), సలీమా(విజయ ప్రవీణ)-సుందరం (కేశవ కర్రి), సునీత (నిత్య శ్రీ), రాజు, రాధ (సుబ్బరావు, రాధ జెస్సీ) గా నటించారు. వీరు కంచెరపాళెం లో నివసిoచే సామాన్య ప్రజలు.  వీరి పేర్లను కనీసం ఎప్పుడు కూడా విని ఉండడు. అలాంటి వీరు నటనలో తమకు ఎంతో అనుభవం ఉన్నట్టు ప్రేక్షకులని మెప్పించారు. అందరూ కొత్త నటీనటులే.  

సాంకేతిక విభాగం :

C/o kancherapalem చిత్రానికి ప్రాణం కొత్త దర్శకుడు మహా. రచయితగా కూడా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకు చెందాల్సిందే. సుమారు 52మందికి పైగా కొత్తవాళ్లతో సినిమా చేసి భేష్ అనిపించుకొన్నారు.

మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. వందలు, వేల కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటూ గొప్పలు చెప్పుకొనే దర్శకులకు కనివిప్పు కలిగించేలా వెంకటేష్ తన టాలెంట్ ని టాలీవుడ్ కి చూపించాడు. మణిశర్మ శిష్యుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ సంగీత దర్శకుడు సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. పట్టి పట్టి నన్నే సూత్తాంటే, ఏమి జన్మమూ.. ఏమి జీవమూ’ హరికథ పాట డిఫరెంట్ గా ఉంటుంది. ఈ చిత్రానికి ఎడిటర్‌గా రవితేజ గురిజాల, సౌండ్ ఎడిటర్‌గా నాగార్జున తాళ్లపల్లి అద్భుతమైన పనితీరును కనబరిచారు. నిర్మాత పరుచూరి విజయ ప్రవీణాను ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. నిర్మాణ బాధ్యతలనే కాకుండా చిత్రంలో వేశ్యగా అద్భుతమైన పాత్రను చేసి కూడా మెప్పించారు. నిర్మాత పాటించిన ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. ఇంత మంచి చిత్రాన్ని మనకు సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా అందించిన రానాను కూడా అభినందించి తీరాలి.

ప్లస్ పాయింట్స్
డైరెక్టర్ వెంకటేష్ మహా
నటీనటులు ప్రతిభ
సౌండ్ డిజైనింగ్
మ్యూజిక్

కెమెరా
ఎడిటింగ్

మైనస్ పాయింట్స్
కమర్షియల్ విలువలు లేకపోవడo.

తీర్పు :

ఎలాంటి కమర్షియల్ హంగులు ఆర్భాటాలు లేని ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. మొత్తం మీద ఈ సినిమా మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు బెస్ట్ ఛాయిస్.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button