Bumper offer to rashmika

ప్రిన్స్ సరసన కన్నడ అమ్మడు కి ఛాన్స్

రష్మిక మందన్న గీత గోవిందం సినిమా తో తెలుగు తెర మీద ఒక అద్భుతం మొన్నీమధ్య ఆవిష్కరించిన హీరోయిన్. ఒక్క సినిమాతోనే ఇటు తెలుగు యువకుల హృదయాలను,అటు చిత్ర సీమ లోని పలువురు సీనియర్ నటుల అభినందనలు గెలుచుకుని ట్రెండింగ్ లో ఉంది. ఏదేమైనా తన అదృష్టమే అదృష్టం ఎందుకంటే ఇప్పుడు పెద్ద హీరోలతో ఛాన్స్ కూడా కొట్టేస్తుంది. ఆఫర్ ల మీద ఆఫర్ లతో బిజీ అయిపోతుంది.
ఈ ఆఫర్ ల వెల్లువ తో కన్నడ నటుడి తో అయిన నిశ్చితార్ధం కూడా రద్దు చేసుకుంది అంట ఈ అమ్మడు. ఈ మధ్యే టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు సరసన మైత్రి బ్యానర్ లో నిర్మించబోయే సినిమా కి సైన్ చేసిందిట . మొత్తం మీద జాక్ పాట్ కొట్టేసి తెగ ఆనందం లో ఉంది ఎందుకంటే స్టార్ హీరో లతో నటించే ఛాన్స్ అందరికీ దొరకదు అది కూడా ఒక్క సినిమా సక్సెస్ తో . . .
ఇదే సక్సెస్ ను కొనసాగించాలి అని మన తెలుగు విజన్ టీం కోరుతూ ఉంది
విష్ యు బెస్ట్ లక్ రశ్మిక

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)