big offer to ntr biopic overseas rights

మరో సంచలనం దిశగా అన్నగారి బయో పిక్

తెలుగు తెర మీద తిరుగు లేని కథానాయకుడు ఎన్టిఆర్ జీవిత చరిత్రను ఆయన నట , రాజకీయ వారసుడు బాలకృష్ణ నిర్మాణ సారధ్యంలో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వార్తలు ఎప్పటికపుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయ్ .
చిత్రం మీద ఏరోజు కి ఆరోజు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయ్ దానికి కారణం ఇందులో ఉన్న పాత్ర ల కోసం అనేక మంది అగ్ర నటులు , నటీమణులను ఎంచుకోవడం ఒక కారణం అయితే మరో కారణం ప్రజల ఆసక్తి, దీనికి తగ్గట్టుగానే మార్కెట్ అంచనా కూడా అలానే పెరుగుతుంది. ఈమధ్యన ప్రముఖ సంస్థ ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఏకంగా 20కోట్ల రూపాయల తో కొనుగోలు చేయడం కోసం పోటీ పడుతుంది. ఇది బాలయ్య బాబు కెరీర్ లోనే ఉత్తమ కలెక్షన్ అవుతుంది. ఏదేమైనా ఈ చిత్రానికి సంబంధం ఉన్న ప్రతి వార్త కూడా ఇటు అభిమానులను , అటు చిత్ర పరిశ్రమను ఆనందం లో తేలిపోయే దిశగా ఉంటుంది. క్రిష్ దర్శకత్వం లో ఈ సినిమా రెండు భాగాలుగా సంక్రాంతి పండగ కానుకగా తెలుగు రాష్ట్రాలలో సందడి చేయనుంది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)