అధిక బరువును తగ్గించుకోవడానికి ముఖ్యమైన మూడు యోగాసనాలు

హాయిగా, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అధిక బరువుతో బాధపడుతున్నారా?  స్లిమ్ గా, ఫిట్ గా కనిపించాలి అనుకుంటున్నారా? గంటల తరబడి జిమ్ లో మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకుంటున్నారా? వీటన్నింటికి ఒక్కటే పరిష్కారం యోగాసనాలు. యోగాసనాలలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ఇప్పుడు చెప్పబోయే మూడు ఆసనాలు మిమ్మల్ని స్లిమ్ గా, ఆరోగ్యంగా, అందంగా కనపడేలా చేస్తాయి. ముఖ్యంగా మీ అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. చేయవలిసిoదల్లా  క్రమం తప్పకుండా ఈ యోగాసనాలను రోజు చేయడం.

పాదహస్తాసనం:

ఈ ఆసనం ను రోజు వేయడంవల్ల తక్కువ సమయంలో అధిక బరువును తగ్గవచ్చు, దీనివల్ల ముఖకాంతి పెరుగుతుంది, శారీరక మరియు మానసిక బలం పెరుగుతుంది. మీ శరీరంలో రక్తప్రసరణ తీరు మెరుగుపడుతుంది. మీ శరీరం ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. మీ పొట్టలో పేరుకున్న అధిక కొవ్వును తొలగిస్తుంది, మీ వెన్నుముకకు బలాన్ని చేకూరుస్తుంది.

పశ్చిమోతాసనం:

ఈ ఆసనం ద్వారా అందమైన చర్మం మీ సొంతం, మీ ఎత్తును కూడా పెంచుకోవచ్చు. మలబద్ధకంను తొలగిస్తుంది, పొట్టలో పేరుకున్న అధిక కొవ్వును తొలగిస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. జీర్ణక్రియ పనితీరు సరిగా ఉండేలా చూస్తుంది.

చక్రాసనం :

ఈ ఆసనం మన కిడ్నీలు, కాలేయం మరియు పాంక్రియాస్ లు సరిగా పని చేసేలా చేస్తుంది. ఆస్టియోపొరోసిస్ , ఆస్తమా రాకుండా నిరోధిస్తుంది.

ఈ మూడు ఆసనాల ద్వారా ముఖ్యంగా మన బాడీ ఫిట్ గా ఉంటుంది. ఈ ఆసనాలతో పాటు మనం తీసుకునే ఆహారoలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే అందమైన, స్లిమ్ గా ఉండే శరీరం మన సొంతం. ప్రతిసారి మనం తీసుకునే భోజనానికి, భోజనానికి మధ్య కనీసం మూడు గంటల వ్యవధి ఉండాలి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు ఈ ఆసనాలు వేసేముందు తీసుకోవాలి. మరి మీరు ప్రయత్నిస్తారుగా!

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)