మొహంపై మొటిమలు రాకుండా ఉండేందుకు తీసుకోవలసిన ఆహారపదార్థాలు

టీనేజ్ కి రాగానే అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరిలో సర్వసాధారణంగా హార్మోన్స్ వల్ల అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. సాధారణంగా వీటిలో ఒకటి చర్మంపైన మొటిమలు రావడం కూడా. ఈ మొటిమలు ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్నవారిలో ఎక్కువగా చూడవచ్చు. ఉదయం లేవగానే మీ అందమైన మొహం అద్దంలో చూసుకున్నప్పుడు మొటిమలు కనిపిస్తే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా! ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి లేదా పార్టీ ఉన్నప్పుడు ఈ మొటిమలు మన మొహoపై వస్తే  అవి మనకి  బాగా చిరాకును కలిగిస్తాయి. మూడ్ ఆఫ్ అవుతుంది.

ఈ మొటిమలను నివారించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే వంటింట్లో దొరికే వాటితో హోమ్ రెమెడీస్, బామ్మ చెప్పే చిట్కాలు ఇలా ఎన్ని చేసిన ఇవి తిరిగి మరల మరల వస్తూనే ఉంటాయి.మ్ వీటిని తగ్గించడానికి మార్కెట్ లో ఎన్నో రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. చాలా మంది వీటిని కూడా ట్రై చేసి విసిగిపోయి ఉంటారు. అయితే ఈ మొటిమలు పూర్తిగా రాకుండా అడ్డుకోలేకపోయిన మనం ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్, సరైన డైట్ ని పాటిస్తే వీటి బారి నుండి తప్పించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కేవలం చర్మం యొక్క ఉపరితలంపై మాత్రమే కాకుండా, లోపల శరీరoలో నుండి బయటకు వచ్చే ఈ మొటిమల సమస్యని నిర్మూలించడానికి కూడా సహాయపడుతుంది. ఈ మొటిమలు వదిలించుకోవడానికి మీ రోజువారీ ఆహారంలో మీరు తీసుకోవలసిన కొన్ని ఆహార పదార్థాలను ఇప్పుడు చూద్దాం.

* బ్రౌన్ రైస్ విటమిన్ B, ప్రోటీన్, మెగ్నీషియం, మరియు అనేక యాంటీ-ఆక్సిడెంట్స్ తో లోడ్ అయ్యి ఉంటుంది. విటమిన్ బి ఒక స్ట్రెస్ ఫైటర్ గా పని చేస్తుంది. ఇది ముఖ్యంగా హార్మోన్ల లెవెల్స్ ని క్రమబద్దీకరించడానికి మరియు మొటిమలు ఎక్కువగా రాకుండా నిరోధిస్తుంది.

* వెల్లుల్లి మొటిమలు పోవడానికి ఒక సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. దీనిలో సహజంగా ఉండే రసాయనికమైన అల్సిలిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బాడీలో ఉండే హానికరమైన బాక్టీరియా,వైరస్ ని చంపుతుంది. సాధారణంగా వెల్లుల్లిని కట్ చేసి మొటిమలపై  రుద్దితే ఒకవేళ వాపు ఏదైనా ఉంటే తగ్గుతుంది.

* ఫిష్ లో సాధారణంగా ఒమేగా-3 మరియు ఒమేగా-6 ఫాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. అయితే, ఈ ఫాటీ యాసిడ్స్ చర్మంలో ఉండే  వాపును తగ్గిస్తాయి మరియు మొటిమలను పోగొట్టడానికి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు.

* విటమిన్ ఎ మరియు కరోటినాయిడ్స్ అధికంగా ఉండే ఆహారం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. క్యారెట్, పాలకూర, కాలే, వెజిటబుల్ సూప్, మామిడి, బొప్పాయి, ఓట్ మీల్, ఫ్రోజెన్ బఠానీలు మరియు టమోటా జ్యూస్ వంటి వాటిలో  కరోటినాయిడ్లు ఉంటాయి.

మనం తినే ఆహారంలో ఈ పదార్ధాలను తీసుకుంటే చాలా వరకు మొటిమలు రాకుండా నివారించుకోవచ్చు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)