telugu gods devotional information in telugu

కార్తీక బహుళ ప్రతిపద ఆరాధన

నేటి విశేషం కార్తీక బహుళ పాడ్యమి లేదా ప్రతి పద.కార్తీక మాసం లో రెండవ ఘట్టంలోని మొదటి రోజు.ఇది శనివారంతో కూడి వచ్చింది.హరిహరుల ఆరాధనతో పాటు స్వథాగ్ని ని ఆరాధన చేయాలి.

“అగ్ని ముఖతా: సర్వదేవ కార్యాని”అని వేదాలు చెబుతున్నాయి.దేవతలకు చేసె ఏ కార్యమైనా కూడా అగ్ని సమక్షంలో లేదా అగ్ని ముఖం గా చేయాలి.దేవతలకు మనిషికి మధ్య హవిస్సులను తీసుకుపొయే వారధిగా అగ్ని పరివారం ఉపయోగపడటం మన సంప్రదాయం తెలుపుతుంది.అగ్ని యొక్క ఆరాధన ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని స్మృతులు చెబుతున్నాయి.కాబట్టి ఈరోజు అగ్నికి ఆరాధన చేయండి.వీలయితే ఆకుపచ్చని ఆకు కూరలు దానం చేయండి.శనివారం తో కలిసి వస్తుంది కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన కూడా ఉపకరిస్తుంది.
జై శ్రీమన్నారాయణ.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button