Today Telugu News Updates

వీళ్ళు మామూలు పోలీసుల కాదు

9 గంటల్లోనే కిడ్నాప్ కేసు చేధించిన పోలీసులు వీళ్ళు మామూలు పోలీసుల కాదు నెలల పాప కిడ్నాప్ కేసును హైదరాబాద్ పోలీసులు గంటల్లోనే చేధించారు . కిడ్నాపు పాల్పడిన ముగ్గిరిని అరెస్ట్ చేశారు . వారి వద్ద నుంచి పాపను తీసుకుని వారి తల్లిదండ్రలకు అప్పగించారు . డిసిపి సౌత్ జోన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈకేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు . ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి . ఫారూఖ్ నగర్‌కు చెందిన షేక్ బషీర్ ( 35 ) కార్మికునిగా పని చేస్తున్నాడు . అతిని భార్య సుల్తానా , వారికి రెండు సంవత్సరాల బాబు , రెండు నెలల పాప ఉన్నది .

హైదరాబాద్ లోని వట్టేపల్లిలో నివాసం ఉంటున్న సయ్యద్ సాయిల్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు . అతని భార్య జబీనా ఫాతిమా వారికి పిల్లలు లేరు . దీంతో సాయిల్ , జబీమాన ఫామితిమా , ఆమె చెల్లెలు ఫాతిమాతో కలిసి కిడ్నాపింగ్ కు ప్లాన్ వేశారు . ఇందులో భాగంగా ఫారూఖ్ నగర్ కు చెందిన షేక్ బషీర్ , సుల్తానా దంపతులకు పుట్టిన రెండు నెలల పాపను కిడ్నాప్ చేశారు . షేక్ బషీర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు .

వీళ్ళు మామూలు పోలీసుల కాదు ::

దీంతో సౌత్ జోన్ డిసిపి గజారావు భూపాల్ నేతృత్వంలో అడిషనల్ డిసిపి రఫీక్ పోలీసుల బృందం దర్యాప్తు మొదలు పెట్టింది . మూడు విభాగాలుగా రంగంలోనికి దిగింది . సిసిటివి కెమెరాల సహాకారంతో కిడ్నాపర్లను గుర్తించింది . పోలీసుల బృందం వెంటనే సలామీ ఆస్పత్రి , నైహోటల్ వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నారు . వారి వద్ద ఉన్న రెండు నెలల పాపను తీసకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు . 9 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేధించడం పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ దర్యాప్తు బృందాన్ని అభినందించారు . సిసిటివి కెమెరాల పాత్ర కీలకం : అంజనీకుమార్ అనేక కేసుల్లో సిసిటివి కెమెరా పాత్ర కీలకంగా ఉంటుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు . హైదరాబాద్ అత్యంత సురక్షి తమైన నగరమని , సిసిటివి నెట్ వర్క్ లో హైదరాబాదు నెంబర్ వన్ స్థానం ఉన్నదని , ప్రపంచంలోనే 16 వ స్థానంలో ఉన్నామని వివరించారు . సిసిటివి ఏర్పాటులో ప్రపంచంలోనే హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలోనికి రావాలన్న మన లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button