వదంతులేనని కొట్టి వేసిన ఆది

హైపర్ ఆది ఈ పేరు చెప్తే మనకు గుర్తుకు వచ్చేవి రెండు , అతడు పంచ్ డైలాగ్స్ తో చేసే కామెడీ , ఇంకోటి జబర్దస్త్ షో. ఈ షో ద్వారా ఆది సంపాదించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. యూ ట్యూబ్ లో కూడా ఆది నటించిన ప్రోగ్రాం క్లిప్ లు ఎక్కువ వ్యూస్ తో ట్రెండ్ అవుతూ ఉంటాయ్. గత కొన్ని రోజులు గా ఆది తన రెగ్యులర్ షో లో కనిపించడం లేదు.
ఈ కారణం తో తన మీద సోషల్ మీడియా లో రకరకాల వదంతులు వ్యాపించాయి.కాగా తాజాగా తనకు యాక్సిడెంట్ అయి ఆసుపత్రి లో ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.
వీటన్నింటికి తెర లేపుతు ఆది ఒక సేల్ఫి వీడియో రిలీజ్ చేసాడు.తనకు ఎలాంటి ప్రమాదం కలగలేదని, కొన్ని యూ ట్యూబ్ , వెబ్ చానల్స్ వారి స్వలాభం కోసం తన మీద చెత్త వార్తలు రాయడం మరి ఘోరం అని, సిగ్గు చేటు అని చెబుతూ సిని అవకాశల వల్ల అటు షూటింగ్ లో ఇటు జనసేన పార్టీ తరపున సభల్లో , రోడ్ షోలో పాల్గొనడం వల్ల కొద్దికాలం షో కి దూరంగా ఉంటున్నట్టు తెలిపారు.
ఏదేమైనా ఈ వీడియో ద్వారా ఆది ప్రజలకు నిజం తో పాటు కనెక్ట్ అయ్యారు కదా ? ?

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)