‘మా’ మొదటి జనరల్ బాడీ మీటింగ్ సక్సెస్ !

జనరల్ బాడీ మీటింగ్ విజయవంతంగా జరిగిన సందర్భంగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెస్ మీట్ ఆదివారం ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ హీరో రాజశేఖర్, మా ప్రెసిడెంట్ నటుడు నరేష్, వైస్ ప్రెసిడెంట్ నటి హేమ, జనరల్ సెక్రటరీ నటుడు శివ బాలాజీ, నటుడు తనీష్, ట్రెజరర్ రాజీవ్ కనకాల, మా ఈసీ మెంబర్ సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవదాస్ కనకాల, పరుచూరి బ్రదర్స్, కృష్ణంరాజు సత్కరించుకున్నారు.

ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ
… చాలా రోజుల తరువాత జనరల్ బాడీ మీటింగ్ కు అటెండ్ అయ్యాను. ఈ.సి. మెంబర్స్ లో కొన్ని విభేదాలు ఉన్నాయని బయట వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదు. ఈ రోజు జరిగిన జనరల్ బాడీ మీటింగ్ ప్రశాంతంగా జరిగింది. అందరిలో యూనిటీ ఉంది. కలిసి పనిచేసి అందరిని కలుపుకొని వెళుతున్నాం. ఎక్స్ ప్రెసిడెంట్ శివాజీ రాజా, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ నరేష్ నేను కిలిసి చక్కగా మాట్లాడాము. అన్నారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ… ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈసారి జనరల్ బాడీ మీటింగ్ లో కృష్ణంరాజు గారిని, పరుచూరి బ్రదర్స్ గారిని సత్కరించుకోవడం విశేషం. మీటింగ్ చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. భవిషత్తులో చెయ్యాల్సిన కొన్ని మంచి పనులు గురించి చర్చించుకున్నాము. ఈ మీటింగ్ కు చాలా మంది సభ్యులు హాజరు అవ్వడం విశేషం. కల్కి చిత్రం విజయం సాధించి రాజశేఖర్ గారికి మరో సక్సెస్ రావాలని ఈ సభా ముఖంగా కోరుకుంటున్నాను అన్నారు.

నటి హేమ మాట్లాడుతూ…

జనరల్ బాడీ మీటింగ్ ఎలా జరుగుతుందో అనుకున్నా, చివరికి అందరూ కలిసిపోయి మాట్లాడుతూ ఉండడం చూసి సంతోషం వేసింది. ఈ మీటింగ్ లో కొందరు ఆడవాళ్లు వారికి అవకాశాలు రావడం లేదని భాధ పడుతున్నారు. ఈ సందర్బంగా దర్శకులకు, రచయితలకు నేను చెప్పేది ఒక్కటే.. దయచేసి తెలుగు ఆడవారిని గౌరవించడి. వారికి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించండి. మొదటి ప్రాధాన్యత తెలుగు వారికి ఇవ్వమని కోరుతున్నా అన్నారు.

నరేష్ మాట్లాడుతూ…

ఇక్కడికి వచ్చిన మీడియా వారికి కృతజ్ఞతలు. ఈరోజు జరిగిన జనరల్ బాడీ మీటింగ్ బాగా జరిగింది. గతంలో కృష్ణ గారు, ఏ.ఎన్.ఆర్ గార్లను సత్కరించుకున్నాం. ఈసారి కృష్ణంరాజు గారిని సత్కరించుకోవడం విశేషం. యూనిటీగా, క్రమశిక్షణతో మేము ముందుకు వెలుతున్నాం. హెల్ప్ లైన్, సజేషన్ బాక్స్, ఆర్టిస్ట్ పెన్షన్ వంటి వాటిని అమలులోకి తీసుకురాగలిగాం. ప్రభుత్వం మాకు సహకరిస్తోంది. కొంతమంది మా సభ్యులకు పెన్షన్ కల్పించడం వంటి కార్యక్రమాలకు చెయ్యడం హర్షణీయం. మా ప్యానెల్ వచ్చిన 90 రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేశాం. భవిషత్తులో వీలైనన్ని మంచి కార్యక్రమాలకు చేసి మెంబర్స్ కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి సహాయం చేస్తామని ఈ సందర్బంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్నారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)