నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో శేఖర్ కమ్ముల కొత్త చిత్రం ప్రారంభం….!!

అందరిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దగల దర్శకులు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నేడు నూతన చిత్రం ప్రారంభమయింది. ఈ చిత్రంలో గతంలో శేఖర్ కమ్ములతో ఫిదా వంటి సూపర్ హిట్ చిత్రంలో భాగమైన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. నేడు ఈ చిత్ర అధికారిక పూజా కార్యక్రమాలు సికింద్రాబాద్ లోని విఘ్నేశ్వరాలయంలో జరిగాయి.

ఈ కార్యక్రమంలో నాగచైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ములతో పాటు సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభం అయిన ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విజయ్.సి.కుమార్..నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)